Telangana Elections Results: మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టే ఎమ్మెల్యేలు ఎవరో తెలుసా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ లీడ్ లో ఉండగా.. అధికారం దిశగా పయనిస్తోంది. ఈ క్రమంలో.. కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులు ఈ ఎన్నికల్లో మొదటి సారి గెలిచారు. గతంలో పోటీ చేసి ఓడిపోయినవాళ్లు, ఈసారి మాత్రం పోటీచేసిన వాళ్లలో కొందరిని ప్రజలు ఆశీర్వదించారు. ఈసారి వీరు అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్ష అనే అవకాశం దక్కింది. అయితే వారిలో అతి చిన్న వయస్సు ఉన్న వాళ్లు కూడా ఉన్నారు.
Daggubati Abhiram: సీక్రెట్ గా పెళ్లి చేసుకుంటున్న రానా తమ్ముడు..?
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారిలో పాలకుర్తి నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి యశస్వినిరెడ్డి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుపై 8 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత.. మెదక్ నుంచి మైనంపల్లి రోహిత్‌రావు పద్మాదేవేందర్‌రెడ్డిపై విజయం సాధించారు. అంతేకాకుండా.. వేములవాడలో కాంగ్రెస్ నుంచి ఆదిశ్రీనివాస్ విక్టరీ సాధించారు. అటు.. రామగుండంలో మక్కాన్‌సింగ్ రాజ్ ఠాగూర్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కంటోన్మెంట్ నుంచి మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత తొలిసారి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాగార్జునసాగర్ నుంచి కాంగ్రెస్ సీనియర్‌నేత జానారెడ్డి కుమారుడు జయవీర్‌రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
Revanth Reddy: కొన ఊపిరి వరకు కొడంగలే శ్వాసగా జీవిస్తా: రేవంత్ రెడ్డి
అంతేకాకుండా.. నాగర్‌కర్నూల్ నుంచి కూచకుళ్ల రాజేష్‌రెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసిన కసిరెడ్డి నారాయణరెడ్డి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత.. ఎల్లారెడ్డి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కలకుంట్ల మదన్‌మోహన్‌రావు తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నల్గొండ జిల్లా తుంగతుర్తి నుంచి ముందుల శామ్యూల్.. యాదాద్రి భువనగరి జిల్లా ఆలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల అయిలయ్య ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలో ఖమ్మం ఎంపీగా పనిచేసిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాలేరు నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వీరంతా తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వారే..
తాజావార్తలు
-
Sonam Wangchuk: “అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా”.. ప్రొటెస్ట్‌కు ముందు సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ప్రకటన..
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!