MLA Laxmareddy: తెలంగాణలో ప్రతి ఆడబిడ్డ బాగు చూసేది మన కేసీఆర్ ప్రభుత్వమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Laxmareddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో పార్టీ శ్రేణులు ప్రచారాలు, సభలు, సమావేశాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. పోలింగ్ కు ఇక 4 రోజులు సమయం ఉండటంతో ప్రచారంలో పార్టీ శ్రేణులు, నాయకులు దూసుకుపోతున్నారు. ప్రజలకు హామీలు ఇస్తూ ఇంటింటికి వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోవాలని పార్టీకి ఓటు వేయాలని కోరుతున్నారు. అయితే.. బీఆర్ఎస్ అభ్యర్ధి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నేడు జడ్చర్ల మండలం పోలేపల్లి, మాచారం,గంగాపుర్ గ్రామాల్లో కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండో స్థానం కోసమే కాంగ్రెస్, బీజెపి పోటీ చేస్తుందని అన్నారు. తెలంగాణలో ప్రతి ఆడబిడ్డ బాగు చూసేది మన కేసీఆర్ ప్రభుత్వమే అన్నారు. మహిళలకు సౌభాగ్యలక్ష్మి పథకం కింద నెలకు రూ.3 వేల ఆర్థిక సాయం, రూ.400కే గ్యాస్ సిలిండర్ అందించబోతుందని స్పష్టం చేశారు. ఇప్పటికే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆరోగ్య లక్ష్మి, ఆరోగ్య మహిళా కేంద్రాలు వంటి ఎన్నో సంక్షేమ పథకాలతో మహిళలకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. అందుకే రాబోయే ఎన్నికల్లో జడ్చర్ల అసెంబ్లీ ఈవిఎంపై సీరియల్ నెంబర్ 2 కారు గుర్తుకు ఓటువేసి భారీ మెజార్టీ గెలిపించాలని కోరారు.
Read also: Ashika Ranganath: ఈ అమ్మాయి బాగుంది కానీ ఆఫర్స్ అంతంత మాత్రమే…
Also Read
తెలంగాణ ప్రభుత్వంలో ప్రతి గడపకి ప్రభుత్వ సంక్షేమ ఫలం అందిందని ,అభివృద్ది చేసే ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ నవంబర్ 30న కారు గుర్తుకు ఓటువేసి అఖండ మెజారిటీ అందించాలని ప్రజలను కోరారు. గతంలో 11 సార్లు అధికారం ఇస్తే కనీసం తాగునీళ్లు కూడా ఇవ్వనోళ్లు ఇవాళ వచ్చి ఉచిత పథకాల పేరుతో హామీ ఇస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. గ్యారెంటీల పేరుతో కర్ణాటకలో అధికారంలోకి రాగానే చేతులు ఎత్తేసారని ఆయన చెప్పారు. నిర్ణయాలు తీసుకునే అధికారం మన చేతిలో ఉండాలంటే బీఆర్ఎస్ ను అఖండ మెజార్టీతో గెలిపించాలని జడ్చర్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కోరారు. మళ్లీ మన కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విడతల వారీగా పెన్షన్లు ఐదు వేలకు పెంచుతాం.. రైతు బంధును ఏడాదికి ఎకరాకో రూ. 16 వేలకు పెంచుతాం.. ప్రతి ఇంటికి ఐదు లక్షల కేసీఆర్ బీమా పథకాన్ని వర్తింపజేస్తాం.. గత తొమ్మిదేళ్ల పాలన చూసారు.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మీ ముందరే ఉన్నాయి.. ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోండి.. ఎలక్షన్లప్పుడు వచ్చి ఉచిత హామీలు ఇచ్చే టూరిస్టుల మాటలు నమ్మి మోసపోయి గోసపడొద్దు అంటూ జడ్చర్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు.
Ashika Ranganath: ఈ అమ్మాయి బాగుంది కానీ ఆఫర్స్ అంతంత మాత్రమే…
తాజావార్తలు
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
-
AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
-
OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
-
OTR: సీఎం టూర్లో బయటపడ్డ కాంగ్రెస్ విభేదాలు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?