Revanth Reddy: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. ఇందులోభాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. ప్రతి రోజూ నాలుగైదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం, రోడ్ షోలు కొనసాగుతున్నాయి. ఈరోజు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇవాళ ఆరు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్‌నగర్, కామారెడ్డి, పఠాన్ చెరు, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ప్రచార సభలకు రేవంత్ హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు నారాయణపేట బహిరంగ సభ, 11 గంటలకు దేవరకద్ర బహిరంగ సభ, 12 గంటలకు మహబూబ్ నగర్ బహిరంగ సభ, 2 గంటలకు రాహుల్ గాంధీతో కామారెడ్డి బహిరంగ సభకు రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. సాయంత్రం 5.30 గంటలకు పఠాన్ చెరులో జరిగే బహిరంగ సభ, 6.30 గంటలకు శేరిలింగంపల్లి బహిరంగ సభకు రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.
Read also: Rahul Gandhi: హైదరాబాద్‌లో రాహుల్ ఆకస్మిక పర్యటన.. నిరుద్యోగులతో చిట్ చాట్
ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న కల్వకుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగిరినపుడే మన గౌరవం పెరుగుతుందని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇక్కడ కట్టిన సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల అభివృద్ధి కాంగ్రెస్ హయాంలో జరిగిందేనని రేవంత్ తెలిపారు. కేసీఆర్ నీళ్లు ఇచ్చింది నిజమే అయితే.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పాడావు పడిందని ప్రశ్నించారు. కేసీఆర్ ను ఆనాడు ఎంపీగా గెలిపించినా… ఈ ప్రాంతానికి చేసిందేం లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ బక్కోడు కాదు లక్ష కోట్లు, 10వేల ఎకరాలు దోచుకున్న బకాసురుడు అని దుయ్యబట్టారు. ప్రజలను నమ్మించి మోసం చేసి కేసీఆర్ రెండుసార్లు సీఎం అయ్యారు.. ఆయన కుటుంబ సభ్యులు మంత్రులు అయ్యారని తెలిపారు. కేసీఆర్ కు చర్లపల్లిలో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తామని విమర్శించారు. ఈ నెల కేసీఆర్ వేసే రైతు బంధు 10వేలే.. వచ్చే నెల కాంగ్రెస్ వస్తే 15వేలు అని రేవంత్ పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేసి రైతులకు నష్టం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా సరే.. కాంగ్రెస్ రాగానే మిగిలిన డబ్బులు రైతులకు చెల్లిస్తుందని తెలిపారు. బీజేపీకి ఓటు వేస్తే మూసీలో వేసినట్లేనని రేవంత్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు.
Karthika Masam : కార్తీక మాసంలో దీపాలను నీటిలో ఎందుకు వదులుతారో తెలుసా?