తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల 245 పోలింగ్ బూత్ వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పోలింగ్ కేంద్రం వద్ద అధిక సంఖ్యలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఉండడం, జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎక్కువ సేపు పోలింగ్ బూత్ దగ్గరే ఉంటూ ఓటర్లను కలుస్తున్నాడని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం ఒకరిపై ఒకరు…
Congress Filed Complaint on MLC Kavitha: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితపై భారత ఎన్నికల సంఘం (ఈసీ)కు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. కవిత ఓటేసిన అనంతరం బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారని, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమే అని పేర్కొంటూ ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఛైర్మన్ నిరంజన్ తెలిపారు. ‘ఎమ్మెల్సీ కవిత గారు.. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి…
Mohammed Azharuddin Cast His Vote: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ జరుగుతోంది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలవగా.. తెలంగాణ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రముఖులు అందరూ ఉదయమే ఓటేస్తున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్, కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి మహ్మద్ అజారుద్ధీన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అజారుద్ధీన్ కుమారుడు అసదుద్దీన్ కూడా ఓటేశారు. Also Read: Telangana Elections 2023: ఓటు హక్కు…
Election Ink: ఎన్నికలలో సిరా చుక్క చాలా ముఖ్యమైన అంశం. సిరా చుక్క ఓటేశాం అని చెప్పేందుకు గుర్తుగానే కాదు.. నకిలీ ఓట్లను అరికట్టేందుకు, ఒకసారి ఓటు వేసిన వారిని గుర్తుపెట్టుకునేందుకు భారత ఎన్నికల సంఘం దశాబ్దాలుగా ఈ విధానాన్ని అమలు చేస్తోంది.
Chiranjeevi and Venkatesh Cast His Votes: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ నగరంలో పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మణికొండలో సీనియర్ హీరో, విక్టరీ వెంకటేష్ ఓటు వేశారు. జూబ్లీహిల్స్ క్లబ్‌లో భార్య సురేఖతో కలిసి మెగాస్టార్ చిరంజీవి ఓటు వేశారు. దర్శకుడు తేజ కూడా ఓటేశారు. ఇందుకు సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, హీరో సుశాంత్,…
తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 5 గంటలకు వరకు కొనసాగనున్నది. ఉదయం నుంచే ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సెలెబ్రిటీలు సైతం క్యూలో నిల్చొని ఓటేస్తున్నారు. పోలింగ్ సందర్భంగా మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. మీ ఓటు.. పరుగులు పెడుతున్న తెలంగాణ ప్రగతికి పునాదిగా నిలవాలన్నారు. మీ ఓటు.. తెలంగాణ ఉజ్వల భవితకు బంగారు బాటలు వేయాలని…
Telangana Elections : తెలంగాణలో పోలింగ్ షురూ అయింది. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా 70 నుంచి 75 శాతం మధ్య పోలింగ్ నమోదవుతుంది. అంటే పాతిక నుంచి ముఫ్ఫై శాతం మంది ఓట్లు వేయడమే మానేశారు.
EVM’s Not Working in Telangana State: తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 5 గంటలకు వరకు కొనసాగనున్నది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. ఇప్పటికే పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలోని 117వ బూత్‌లో…
Allu Arjun Cast his Vote: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 119 నియోజకవర్గాల్లో పోలింగ్ మొదలైంది. ఈరోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ ఆరంభం అయింది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. సెలెబ్రిటీలు సైతం ఉదయమే తమ ఓటును వేసేందుకు వస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. Also Read: Telangana Elections 2023: తెలంగాణలో పోలింగ్.. ప్రధాని మోడీ ట్వీట్!…