Kishan Reddy: హైదరాబాద్ వేదికగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఘనంగా మొదలైంది. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్రమంత్రి అనేక విషయాలపై మాట్లాడారు. ఈ సందరబంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం అంటేనే సాంకేతికతో సంప్రదాయం, శాస్త్ర పరిజ్ఞానంతో ఆధ్యాత్మికత, వారసత్వ సంపదతో సృజనాత్మకత కలగలిసి ఉంటాయి. తెలంగాణ ఏర్పడిన 2014లోనే మార్పు, పారదర్శకత నినాదంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేంద్రంలో అధికారంలోకి వచ్చారు. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రపంచంలోనే శక్తిమంతమైన దేశంగా భారత్ అవతరించింది. పేదరిక…