తన చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతానని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కరీంనగర్ కలెక్టరేట్ లో దళిత బంధు పై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. రెండున్నర గంటలపాటు దళిత బంధుపై చర్చలు జరిపారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… దళితజాతి పేదరికంలో మగ్గిపోతూ సామాజిక వివక్షకు గురవడానికి సభ్య సమాజమే కారణమని, ఎన్నట నుంచి ఎవరు పెట్టిండ్రోగాని ఇది దుర్మార్గమైన…
దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబడుతున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి మరో రూ. 500 కోట్ల నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. హుజూరాబాద్ సభ అనంతరం పైలట్ ప్రాజెక్టు అమలుకోసం మొత్తం 2000 కోట్ల నిధులు విడుదల చేయాలని సిఎం కెసిఆర్ ఆదేశాలు జారీ చేశారు. మొదటి విడతలో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన రూ.500 కోట్ల తో పాటు ఇప్పుడు విడుదల చేసిన రూ.500 కోట్లు కలిపి హుజూరాబాద్ నియోజకవర్గంలో…
మార్కెట్ కమిటీ చైర్మైన్ సురేందర్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డికి నిరసన సెగ తగిలింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్టీ, బీసీ బంధు ప్రకటించాలని కార్యక్రమం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు తెలపడంతో వికారాబాద్ జిల్లా పరిగి మార్కెట్ యార్డులో ఉద్రిక్తత చోటుచేసుకొంది. మంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు అనుమతివ్వాలని పోలీసులతో కాంగ్రెస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే, మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. వారిని అడ్డుకున్న పోలీసులు…
తెలంగాణ ప్రభుత్వం మరో పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే త్వరలో అమలు చేయబోతున్న దళిత సాధికారత పథకానికి.. “తెలంగాణ దళిత బంధు” అనే పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. మొదటగా, పైలట్ ప్రాజెక్టు కింద ఒక నియోజక వర్గాన్ని ఎంపిక చేసి, ‘తెలంగాణ దళిత బంధు’ పథకాన్ని అమలును ప్రారంభించాలని సమావేశం నిర్ణయించింది. అందులో భాగంగా పైలట్ నియోజకవర్గంగా కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజవర్గాన్ని ఎంపిక చేశారు. read also :…