మార్కెట్ కమిటీ చైర్మైన్ సురేందర్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డికి నిరసన సెగ తగిలింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్టీ, బీసీ బంధు ప్రకటించాలని కార్యక్రమం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు తెలపడంతో వికారాబాద్ జిల్లా పరిగి మార్కెట్ యార్డులో ఉద్రిక్తత చోటుచేసుకొంది. మంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు అనుమతివ్వాలని పోలీసులతో కాంగ్రెస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే, మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. వారిని అడ్డుకున్న పోలీసులు కొందరు కార్యకర్తలను పోలీసు స్టేషన్ కు తరలించారు. ఓ వైపు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం.. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తల నిరసనతో ఉద్రిక్తత చోటుచేసుకొంది.