Telangana Police Websites Hacked: తెలంగాణలో హ్యాకింగ్ బెడద రోజు రోజుకూ పెరుగుతోంది. తాజాగా ఏకంగా పోలీస్ కమిషనరేట్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశారు. సైబరాబాద్, రాచకొండ పోలీస్ వెబ్‌సైట్‌లు పది రోజులుగా పని చేయడం లేదు. ఇటీవల హై కోర్టు వెబ్‌సైట్ హ్యాక్ తరువాత పోలీసుల వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశారు కేటుగాళ్లు.. సైట్‌లోని లింక్‌లు ఓపెన్ చేస్తుంటే బెట్టింగ్ సైట్‌లకు రీ-డైరెక్ట్ అవుతోంది. దీంతో ఐటీ విభాగం సర్వర్లు డౌన్ చేసింది. వెబ్‌సైట్‌లు పని చేయకపోవడంతో ప్రజలు…
Hyderabad Cyber Fraud: అర్ధ రాత్రి వేళ ఇంట్లోకి చొరబడి అందినకాడికి దోచుకోవడం, అడ్డొస్తే హతమార్చి సొత్తు కాజేయడం ఒకప్పుడు నేరగాళ్ల పంథా. నగరంలో ఈ తరహా దోపిడీలు, దొంగతనాల స్థానంలో సైబర్ నేరాలు భారీగా పెరిగిపోవడం కలవరపెడుతోంది. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లలో గత కొంతకాలంగా చోరీలు, ఇళ్లల్లో దొంగతనాల కేసుల్లో పెద్దగా పెరుగుదల కనిపించడం లేదు. ఇదే సమయంలో సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా నమోదవుతోంది. తాజాగా హబ్సిగూడ చెందిన డెంటల్ డాక్టర్‌ను సైబర్…
బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసు రోజురోజుకూ హాట్ టాపిక్‌గా మారుతోంది. ఈ కేసులో పలువురు ప్రముఖులు ఇప్పటికే సిట్ విచారణకు హాజరయ్యారు. నిన్న హీరో విజయ్ దేవరకొండ మరియు యూట్యూబర్, నటి సిరి హనుమంతు సిట్ ముందు హాజరయ్యారు. విజయ్ దేవరకొండను అధికారులు సుమారు రెండు గంటలపాటు, సిరి హనుమంతును నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. ఇద్దరినీ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కోసం తీసుకున్న మొత్తాల గురించి, ఆ డబ్బు ఎలా అందిందో, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్…
CP Sajjanar: వాట్సప్ కాల్స్ రికార్డ్ చేస్తున్నారంటూ ప్రచారం సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. రేపటి నుంచి అన్ని ఆడియో వీడియో వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. జనాలకు సంబంధించిన అన్ని సోషల్ మీడియా అకౌంట్లు పర్యవేక్షిస్తామని, కాల్స్ రికార్డు చేస్తామని ఓ పోస్ట్‌లో తప్పుడు వార్తను షేర్ చేశారు. ఈ అంశంపై తాజాగా సీపీ సజ్జనార్ స్పందించారు. తన ఫొటోతో ముద్రించిన ఈ నకిలీ పోస్ట్‌పై సీరియస్ అయ్యారు. వాట్సప్ కాల్స్ రికార్డ్…
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దానికి అనుగుణంగా సైబర్ క్రైమ్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. వాటిని అరికట్టేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అంతరాష్ట్ర ఆపరేషన్ నిర్వహించారు. ప్రత్యేక ఆపరేషన్‌లో దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో ఒకేసారి తనిఖీలు నిర్వహించి మొత్తం 61 మంది నిందితులను అరెస్టు చేశారు.
ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లి ట్రాప్ అయ్యాడు..!! అదృష్టం బాగుండి కొన్నాళ్లకు తిరిగొచ్చాడు. తనలా మరొకరు మోసపోకుండా ఉండాలని కోరుకోవాల్సింది పోయి.. ఉద్యోగాల ఆశ చూపి అమాయకులను విదేశాలకు పంపాడు. ఇదీ చాలదన్నట్టు స్టాక్ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతూ కోట్లు కొల్లగొడుతున్నాడు. ఓ బాధితుడి ఫిర్యాదుతో అడ్డంగా బుక్కై.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కాడు.
Cyber Fraud : సికింద్రాబాద్‌లో ఒక మహిళ తన ఫ్లాట్‌ను అద్దెకు ఇవ్వాలని ఆన్‌లైన్‌లో ప్రకటన ఇచ్చింది. క్వికర్ యాప్‌లో పెట్టిన ఆ ప్రకటనకు ఓ కేటుగాడు కన్నేశాడు. ఫోన్ చేసి తాను ఆర్మీ అధికారిని అని చెప్పి నమ్మబలికాడు. ఫ్లాట్ చాలా బాగుందని, అద్దెకు తీసుకుంటానని చెప్పాడు. అంతేకాదు, ఆర్మీ అకౌంటెంట్ త్వరలోనే మిమ్మల్ని సంప్రదిస్తాడని చెప్పి మరింత నమ్మకం కలిగించాడు. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. ఆర్మీ చెల్లింపులు రివర్స్ మోడ్‌లో ఉంటాయని,…
ఈ సందర్భంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) డైరెక్టర్ డైరెక్టర్ శిఖా గోయల్ మాట్లాడుతూ.. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ నిర్వహించినట్లు, మ్యూల్ ఖాతాలను గుర్తించేందుకు TGCSB స్పెషల్ ఆపరేషన్ చేపట్టిందని తెలిపారు.