భార్యాభర్తలు కలిసి వ్యక్తిని హత్య చేసిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మేడ్చల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ చెందిన ఎదునూరి నరసింహా అలియాస్ చిన్న (32) తన భార్య అనిత(30) తో కలిసి మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని చెక్ పోస్ట్ లో నివాసం ఉంటున్నారు.
కల్తీ కల్లు కేసు వ్యవహారంలో కల్లు కాంపౌండ్ ఓనర్ నిర్వాకం బయటపడింది. కల్తీ కల్లు తాగి స్వరూప అనే మహిళ అస్వస్థకు గురైంది. నాలుగు రోజుల క్రితమే నిజాంపేటలోని హోలీ స్టిక్ హాస్పిటల్లో చేరింది. నిన్న చికిత్స పొందుతూ ఆమె మరణించారు..
భర్తలను భార్యలు మట్టుబెడుతున్న అనేక ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ ప్రరిడిలో దారుణ ఘటన చోటు చేసుకుంది.. బండరాయితో తలపై మోది భర్తను హత్య చేసింది భార్య. భర్త మద్యానికి బానిసై తరచూ తనను వేధిస్తున్నాడని భార్య ఆరోపించింది.
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సభ్య సమాజం అసహ్యించుకునే ఘటనలో కోర్టు ఇద్దరికి జీవిత ఖైదు శిక్ష విధించింది. మామ, కోడలు వివాహేతర బంధాన్ని చూసిన చిన్నారిని ఇద్దరూ కలిసి హత్య చేశారు. ఈ కేసులో సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత దోషులిద్దరికీ జీవిత ఖైదు విధించింది కోర్టు. ఈ వృద్ధుడి పేరు నరసింహారావు. ఇద్దరి స్వస్థలం ఖమ్మం జిల్లా బోనకల్లు. నిజానికి వీరిద్దరూ మామా కోడళ్లు. ఇద్దరికీ వివాహేతర బంధం ఉంది..
జగిత్యాల జిల్లా కోరుట్లలో చిన్నారి హితిక్ష మర్డర్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. హితిక్షను కుటుంబసభ్యురాలే హత్య చేసినట్టు అనుమానాలు వ్యక్తమయ్యయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా చిన్నారి పిన్ని క్రూరత్వం బయటపడింది. బాలిక పిన్ని మమతను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. న్యాయమూర్తి.. మమతకు రిమాండ్ విధించారు.. దీంతో మమతను పోలీసులు జైలుకు తరలించారు. పక్కింటిలో బాలిక హితిక్షను హత్య చేసి పిన్ని మమత ఏమీ తెలియనట్లు…
Bhuvanagiri: భువనగిరిలోని గాయత్రి ఆసుపత్రిపై ఎస్ఓటీ పోలీసులు అర్ధరాత్రి సోదాలు నిర్వహించారు. ఈ దాడుల సమయంలో ఆసుపత్రిలో ఇద్దరు మహిళలకు అక్రమంగా అబార్షన్ చేస్తున్న ఘటనను పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా డాక్టర్ శివకుమార్ ను పోలీసులు గుర్తించి.. అతనిని భువనగిరి టౌన్ పోలీసులకు హ్యాండోవర్ చేశారు. డాక్టర్ శివకుమార్ అరెస్ట్ అవ్వడం ఇది మొదటి సారి కాదు. Read Also:AP Employee unions: ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల హెచ్చరికలు..! 2022లో…
కోరుట్ల చిన్నారి హితిక్ష మర్డర్ కేసులో కొత్త కోణం బయటపడింది. హితిక్షను కుటుంబసభ్యురాలే హత్య చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. ప్రస్తుతం పిన్ని మమత పోలీసుల అదుపులో ఉంది. పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. మమత ఒక్కతే హత్యకు పాల్పడిందా..? ఎవరైనా సహకరించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు దారితీసిన కారణాలను ఆరా తీస్తున్నారు.
చెప్పేవి శ్రీరంగనీతులు... దూరేవి దొంగ గుడిసెలు అన్నట్టుంది అతగాడి యవ్వారం !! గుడి ఎనకా నా సామీ.. అన్నట్టు దేవుడి చాటున గలీజ్ దందా నడుపుతున్నాడు !! ఇంట్లో పూజలు.. హోమాలు చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చాడు కేటుగాడు. అనుమానంతో ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు షాక్ అయ్యారు. ఇంతకూ అతగాడి ఇంట్లో ఏం దొరికింది..?
Son Kills Father: మనిషి కాదు వాడు… నరరూప రాక్షసుడు! కన్నతండ్రినే కిరాతకంగా హతమార్చాడు ఓ కిరాతక కొడుకు. సర్ప్రైజ్ చేస్తాను నాన్న అని.. కళ్లకు గంతలు కట్టి.. ఏకంగా కత్తితో పొడిచి చంపేశాడు. ఇంటి అవసరాల కోసం పొలం తాకట్టు పెట్టి తండ్రి తెచ్చిన డబ్బులను ఆన్లైన్ బెట్టింగ్ లో తగలబెట్టిందే కాకుండా.. డబ్బులేవి అని అడిగిన పాపానికి తండ్రిని హత్యచేశాడు ఈ పుత్రరత్నం. గచ్చిబౌలి పీఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది.…
శంషాబాద్ లో ఒ వ్యక్తి తన ఇంట్లో ఏకంగా గంజాయి మొక్కలను పెంచాడు. పెంచిన గంజాయి విక్రయిస్తాడా? అతనే సేవిస్తాడా అనేది తెలియాల్సి ఉంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఉట్పల్లి గ్రామంలో ఒ వ్యక్తి తన ఇంట్లో రెండు గంజాయి మొక్కలు పెంచాడు.