Vikarabad: పెళ్లికి ముందే భార్య ప్రేమాయణం తెలుసుకుని భర్త తరిమేశాడు...!! భర్తకు దూరమైన విషయం తెలిసి ప్రియుడు మరోసారి దగ్గరయ్యాడు !! భర్త వదిలేస్తేనేం నీకు నేనున్నాంటూ చేరదీశాడు. కానీ.. ఈసారి ఆ ప్రియుడు నమ్మించి వంచించాడు. శారీరకంగా వాడుకుని వదిలేశాడు. అటు భర్తకు దూరమై.. ఇటు ప్రియుడూ వదిలేసి.. ఏకాకిలా మారింది ఆ యువతి. చేసేది లేక న్యాయం కోసం తాండూరు పోలీసులను ఆశ్రయించింది యువతి.
Shocking Fertility Scam Uncovered: సంతాన సాఫల్యం అనే పవిత్రమైన పని చేస్తున్నామని బయటకు చెప్పుకుంటూ నీచపు దందా చేస్తున్నాయి కొన్ని సంస్థలు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ దందా వెలుగులోకి రావడంతో పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇండియన్ స్పెర్మ్ టెక్ సంస్థ చేస్తున్న గలీజ్ దందా బయటకు వచ్చింది. బిచ్చగాళ్లకు బిర్యానీ ఇచ్చి వీర్యం సేకరించినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. అంతే కాదు అడ్డా కూలీ మహిళల నుంచి అండాలు సేకరించినట్లుగా బయటపడింది.…
Gadwal Murder : గద్వాల నవ వరుడు తేజేశ్వర్ హత్య కేసులో పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో కీలక నిందితులైన A1 తిరుమల రావు, A2 ఐశ్వర్యలను పోలీసులు కస్టడీలోకి తీసుకుని వేర్వేరుగా విచారిస్తున్నారు. ఈ విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయని పోలీసులు తెలిపారు. విచారణలో తిరుమల రావు ఐశ్వర్యపై అనుమానంతో ఆమె స్కూటీకి జీపీఆర్ఎస్ (GPS) అమర్చినట్లు తేలింది. ఐశ్వర్య కదలికలను నిరంతరం ట్రాక్ చేయడానికి తిరుమల రావు ఈ…
Man Kills Wife : ఇప్పుడు దేశం మొత్తం ఒకటే ట్రెండ్ నడుస్తోంది. భర్తలను చంపడమే పనిగా పెట్టుకున్నారు భార్యలు.. అంతేకాదు పెళ్లి చేసుకున్న నెల రోజులకే భర్తలను తీసుకెళ్లి చంపేస్తున్నారు. ప్రియుడి మోజులో పడి భర్తలను ట్రాప్ చేసి మరీ కడతేర్చుతున్నారు. అయితే ట్రెండ్‌కు భిన్నంగా హైదరాబాద్‌లో ఒక ఘటన జరిగింది. మరో వ్యక్తితో సంబంధం ఉందన్న అనుమానంతో భార్యను చంపేశాడు భర్త. ఈ ఘటన హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో జరిగింది. ఓ వైపు మేనకోడలు…
Son Kills Father in Vikarabad: తండ్రి కనిపించే దేవుడు. పిల్లల్ని చిన్నపటి నుంచి ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేస్తాడు. రాత్రింబవళ్లు కష్టపడుతూ.. తన కొడుకుకు మంచి భవిష్యత్తు అందరిచాలనే లక్ష్యంతో కృషి చేస్తాడు. తాను ఎలాంటి బట్టలు వేసుకున్నా పర్వాలేదు.. తన కొడుకు మాత్రం మంచి దుస్తులు ధరించాలని, తన కుమారుడికి సమాజంలో మంచి గుర్తింపు లభించాలని ఆశిస్తుంటాడు. లాంటి గొప్పి తండ్రిని ఓ కొడుకు కడతేర్చాడు. కన్నతండ్రిని కొడుకు హత్య చేసిన ఘటన…
Crime News: వికారాబాద్ జిల్లా తాండూర్ మండలంలోని మల్కాపూర్ గ్రామంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. రెడ్డిపల్లి వెంకటేష్ (34) అనే యువకుడిని అతని భార్య జయశ్రీ, మామ పండరి కలిసి హత్య చేసిన ఘటన సంచలనం రేపుతోంది. పోలీసుల అందించిన వివరాల ప్రకారం… వెంకటేష్ తన భార్య జయశ్రీపై అనుమానంతో తరచూ గొడవపడుతూ.. శారీరకంగా, మానసికంగా వేధించేవాడని సమాచారం. ఇదే కారణంగా భార్య మానసికంగా విసిగిపోయి తన తండ్రి పండరి సహాయంతో ఈ హత్య ప్లాన్ వేసినట్లు…
Anil Murder : మెదక్ జిల్లాలో సంచలనం రేపిన కాంగ్రెస్ నాయకుడు అనిల్ హత్యకేసులో కొత్త పరిణామాలు వెలుగుచూశాయి. ఈ నెల 14న వరిగుంతం శివారులో గన్‌తో కాల్పులు జరిపి అనిల్‌ను హత్య చేసిన నిందితులు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో అనిల్ హత్యకు మెదక్ జిల్లా రంగంపేట గ్రామంలోని ఓ ఇంటి స్థలం వివాదమే ప్రధాన కారణమని అనుమానం వ్యక్తమవుతోంది. కొన్ని రోజుల క్రితం ఇంటి స్థలం విషయమై ఇంటి యజమానిని…
ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అని అంటారు. కానీ.. హైదరాబాద్ పోలీసులు మాత్రం ఇట్టే పట్టేసుకున్నారు. వాస్తవానికి.. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పరిధిలోని శిర్డీ హిల్స్‌లో చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఇంట్లో దొంగతనం చేసినవారు ఎవరూ కాదండీ.
ఉమ్మడి మెదక్ జిల్లాలో చేతబడి పేరుతో హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. చేతబడులు చేస్తున్నారన్న అనుమానంతో తోడబుట్టిన వాళ్ళను హత్య చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మూడు రోజుల వ్యవధిలో రెండు దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయి. సాంకేతిక యుగంలోనూ మూఢ నమ్మకాలను బలంగా నమ్ముతున్నారు జనం. ఏదైనా రోగం వస్తే మంత్రాలతోనే వచ్చిందని నమ్ముతున్నారు.
Kidnap : హనుమకొండలో మైనర్ బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. డబ్బు కోసం ఓ మైనర్ బాలుడిని కిడ్నాప్ చేసిన నలుగురు సభ్యుల ముఠాలో ముగ్గురిని హనుమకొండ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. నిందితుల చెరలో ఉన్న బాలుడిని పోలీసులు సురక్షితంగా రక్షించారు. మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసుల వివరాల ప్రకారం, నిందితుల్లో ప్రధాన అనుమానితురాలు పూరి పద్మ గతంలో బ్రాహ్మణవాడలోని క్యాటరింగ్ మాస్టర్…