SBI Robbery : మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ-2 బ్రాంచ్ చోరీ కేసు సినిమాకథలా మారింది. బ్రాంచ్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్న రవీందర్‌నే అసలు సూత్రధారి అని పోలీసులు గుర్తించారు. బ్యాంక్‌లో పని చేస్తూ నమ్మకాన్ని తాకట్టు పెట్టి, డబ్బులపై కన్నేశారు. రూ. 12.61 కోట్ల విలువైన బంగారం, రూ. 1.10 కోట్ల నగదును కన్నుగప్పే ప్లాన్ వేసిన రవీందర్… ‘కస్టమర్ల డబ్బులు కాపాడాలి’ అనే బాధ్యత వదిలి, ‘అంతా నాదే’ అన్న ఆశతో చోరీకి తెగబడ్డాడట. క్యాషియర్ రవీందర్‌కు బ్యాంక్ పనులు సరిపోలేదో ఏమో కానీ, బంగారం, కరెన్సీ లెక్కపెట్టడమే కాదని, వాటిని తనకే సొంతం చేసుకోవాలని కలలు కన్నాడు.
Peddapuram : పెద్దాపురంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు,మంత్రులు
దాంతో బ్యాంక్ భద్రతా బెల్స్ మోగుతున్నా, తనలోని నిజాయితీ స్విచ్ ఆఫ్ చేసి, అదే డబ్బులతో కొత్త సెట్టింగ్‌లు పెట్టేశాడు. ఒక్కడితో సర్దుకోవడం ఎందుకనుకున్నాడో ఏమో కానీ, రవీందర్‌తో పాటు మరో 10 మందిని కూడా ఈ మాయలోకి లాగేశాడు. నోట్ల మత్తులో నమ్మకం మాయం… విశ్వాసం కరిగిపోగా, పోలీసులు మాత్రం ఒక్కొక్కరిని రౌండ్‌అప్ చేస్తూ నిజాన్ని బయటపెట్టారు. బ్యాంక్ అనగానే మనసులో మొదట వచ్చే పదం నమ్మకం. కానీ ఈ కేసుతో ఆ లాక్ తెరుచుకుంది. కస్టమర్లు పెట్టిన నిధుల రక్షకుడే దొంగగా మారిపోవడం చూసి ప్రజలు షాక్‌లో పడ్డారు. అంత పెద్ద మొత్తం ఒకే షాట్‌లో వెళ్లిపోవడంతో… ఇకపై బ్యాంక్‌లో డబ్బు పెట్టేముందు ‘క్యాషియర్ ఎవరబ్బా?’ అని కూడా కస్టమర్లు చెక్ చేసుకోవాల్సిందే అనిపిస్తోంది.
Parliament: ప్రధాని మోడీ, వీవీఐపీల భద్రతకు ముప్పుగా మారిన చెట్టు.. అసలేంటి ఈ కథ..?