Banswada Mother Murder: కన్న తల్లి ఆ కొడుక్కి… భారం అయ్యింది. వృద్దాప్యంలో ఆమెకు సపర్యలు చేయడం భారంగా భావించిన ఆ కసాయి కొడుకు .. నవమాసాలు మోసిన కన్న తల్లిని కడతేర్చాడు. కామారెడ్డి జిల్లాలో ఈ ఘటన కలకలం సృష్టించింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లంలో దారుణ ఘటన జరిగింది. బొర్లానికి చెందిన సాయవ్వ తన ఒక్కగానొక్క కొడుకు బాలయ్యతో.. కలిసి ఉంటోంది. బాలయ్య వ్యవసాయ కూలీగా పనిచేస్తుండగా.. సాయవ్వ అనారోగ్యంతో ఇంట్లో మంచానికి పరిమితమైంది. ఐతే కన్న తల్లి సాయవ్వకు సపర్యలు చేయడం భారంగా భావించిన కుమారుడు.. ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు.
READ ALSO: Instagram : ఆన్‌లైన్ ప్రేమాయణం కోసం భర్తను ఆఫ్‌లైన్‌కు పంపాలనుకుంది..!
గ్రామస్ధులను నమ్మించి.. తల్లిని చంపేశాడు..
ఆసుపత్రికి తీసుకెళ్తున్నానంటూ గ్రామస్ధులను నమ్మించాడు. గ్రామానికి చెందిన మైనర్ బాలుని సహాయంతో సాయవ్వను తన బైక్‌పై ఈనెల 8న బాన్సవాడ వెళ్లాడు. అక్కడి నుంచి పిట్లం మండలం బొల్లక్‌పల్లి శివారులోని.. మంజీరా నది వద్దకు తల్లిని తీసుకెళ్లాడు. నదీ ప్రవాహాం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో తల్లిని తోసేశాడు. ఆమె చనిపోయిందని నిర్దారించుకున్నాక.. అక్కడి నుంచి హైదరాబాద్‌కు పారిపోయాడు నిందితుడు. బాలయ్య వెంట వెల్లిన మైనర్ బాలుడు తిరిగి గ్రామానికి చేరుకున్నాడు. ఐతే సాయవ్వకు ఏమైందని ఎక్కడికి తీసుకెళ్లారని ప్రశ్నించారు. రెండు రోజుల పాటు మాట దాటేశాడు బాలుడు. కానీ సెప్టెంబర్ 11న మంజీరాలో మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో గ్రామస్ధులు ఆమెను సాయవ్వగా గుర్తించారు. అంతకు ముందు సాయవ్వ వెంబడి వెళ్లిన మైనర్ బాలున్ని నిలదీశారు. దీంతో అసలు విషయం బయటపడింది. కొడుకే ఆ తల్లి పాలిట యముడిలా మారిన వైనం వెలుగు చూసింది. ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది..
మంజీరా నదిలో 3 రోజుల తరువాత.. మృతదేహం బయట పడింది. ఆత్మహత్యగా అనుమానించిన పోలీసులు.. అనంతరం అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టు మార్టం కోసం బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. ఐతే గ్రామస్ధులు మృతదేహాన్ని సాయవ్వగా గుర్తించారు. పోలీసులకు జరిగిన విషయం చెప్పారు. అనుమానాస్పద మృతి కేసు కాస్తా.. హత్య కేసుగా మార్చి.. నిందితుల కోసం గాలించారు. ఈనెల 14న బాలయ్యతో పాటు అతనికి సహకరించిన మైనర్ బాలున్ని అరెస్ట్ చేశారు. తమదైన శైలిలో విచారించగా.. తల్లికి సపర్యలు చేయడం భారంగా భావించి నదిలో తోసేసి హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు పోలీసులు చెప్పారు. బాలుడిని జువెనైల్ అబ్జర్వేషన్ హోంకు తరలించినట్లు పోలీసులు తెలిపారు..
ఇటీవలే బాలయ్య భార్య ఆత్మహత్య
తల్లిని హత్య చేసిన బాలయ్యకు.. కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లైంది. ఐతే ఇటీవలే భార్య ఆత్మహత్య చేసుకుంది. దీంతో తీవ్ర మనస్దాపానికి గురైన బాలయ్య.. కొద్ది రోజుల పాటు హైదరాబాద్‌కు బతుకు దెరువు కోసం వెళ్లాడు. ఇటీవలే స్వగ్రామానికి తిరిగొచ్చి.. తల్లితో పాటు ఉంటున్నాడు. బొర్లంలోనే వ్యవసాయ కూలీగా పనిచేస్తూ.. తల్లిని పోషిస్తుండగా.. 77 సంవత్సరాల సాయవ్వ అనారోగ్యానికి గురైంది. మంచానికి పరిమితమై తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఆమెకు సపర్యలు చేయడం భారంగా భావించిన కుమారుడు.. ఈ నెల 8న రాత్రి ఆమెను ద్విచక్ర వాహనంపై ఆసుపత్రికి వెళ్దాం అంటూ తీసుకెళ్లి… కానరాని లోకాలకు పంపించాడు. నిందితుడు ఎర్రోళ్ల బాలయ్యతో పాటు మైనర్ బాలుడు కలిసి.. బోర్లం నుంచి వస్తుండగా కొయ్య గుట్ట చౌరస్తాలో అరెస్ట్ చేశారు. అతని వద్ద ఉన్న బైక్‌తో పాటు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.కన్నతల్లిని కడతేర్చిన ఘటన.. బాన్సువాడలో తీవ్ర కలకలం సృష్టించింది. నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని జీవితం చరమాంకంలో పోషించలేక హత్య చేసిన వైనం అందరినీ కన్నీళ్లుట్టించింది…
READ ALSO: Hardik Pandya New Relationship: హార్దిక్ పాండ్యా మళ్లీ ప్రేమలో పడ్డాడా.. ఎవరా రూమర్ గర్ల్‌ఫ్రెండ్