Ponnam Prabhakar: తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా కుల సర్వే నిర్వహించి శాసన సభలో చట్టం చేసి గవర్నర్ దగ్గర ఆమోదం కోసం పంపామని.. ప్రస్తుతం రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మార్చి 30 నుంచి గవర్నర్ దగ్గరకు వెళ్ళిన బిల్లులు ఇంత వరకు ఆమోదం పొందలేదని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు లేక రెండు సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం నిధులు రాక…
Mahesh Kumar Goud: ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన కీలక సమావేశం అనంతరం తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన కుల సర్వే విధివిధానాలు, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలపై చర్చించామన్నారు. అలాగే తెలంగాణలో కులగణన సర్వే శాస్త్రీయ బద్దంగా చేసిన తీరుపై పార్టీ అగ్ర నేతలకు వివరించామని, రెండు గంటలపాటు సమావేశం జరిగిందన్నారు. Mallikarjun Kharge: తెలంగాణ సర్వే నిర్వహించిన పద్ధతి…
Mallikarjun Kharge: ఢిల్లీలో ఏఐసీసీ నేత మల్లికార్జున ఖర్గే నివాసంలో ఆయనతోపాటు రాహుల్ గాంధీని తెలంగాణ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చలు చేపట్టారు. ఇక సమావేశం అనంతరం మల్లికార్జున ఖర్గే సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వే పై ప్రశంసలు గుప్పించారు. ఇందులో భాగంగా.. తెలంగాణలో బలహీన వర్గాల సాధికారత కోసం కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం 2.0 ఉద్యమాన్ని ప్రారంభించిందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్విట్టర్‌లో…
Jogu Ramanna : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సుమారు 50 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా కుల గణన సర్వే ను నిర్వహించింది. ఈ సర్వేను ప్లానింగ్ కమిషన్ఆ ధ్వర్యంలో రూపొందించి, ఆ నివేదికను రాష్ట్ర కేబినెట్ ఆమోదించడంతో పాటు, అసెంబ్లీ సైతం ఆమోదం తెలిపింది. ఫలితంగా, ఈ నివేదిక అధికారికంగా అమలులోకి వచ్చింది. అయితే, ఈ కుల గణన సర్వే ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సర్వేలో “ముస్లిం బీసీలు ” అనే…
సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కుల గణన సర్వే బుదవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 95 శాతం పూర్తయింది. ఈ సమగ్ర ఇంటింటి సర్వేలో మొత్తం 1,18,02,726 నివాసాలను గుర్తించారు. బుధవారం నాటికి 1,10,98,360 నివాసాలలో సమాచార సేకరణ పూర్తవగా.. కేవలం 7,04,366 నివాసాల సర్వే సమాచారాన్ని మాత్రమే సేకరించాల్సి ఉంది.