Revanth Reddy: తెలంగాణలో సంపూర్ణ మార్పు కోసం హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభించామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్టు నగర్‌లో ఆయన మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. ఉద్యమకారులు తెలంగాణ వస్తే మార్పు వస్తుందనుకున్నారని, నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయనుకున్నారని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. జర్నలిస్టులు జీవితాల్లో మార్పు రావాలనుకుంటున్నారని, కానీ ఎన్నికైన ప్రజాప్రతినిధులు చట్ట సభల్లో మాట్లాడే పరిస్థితి లేదన్నారు. మార్పు రావాలని ప్రతిఒక్కరు కోరుకుంటున్నారు... కాబట్టి మార్పు తీసుకురావడానికి హాత్ సే హాత్ జోడో యాత్ర చేపట్టామన్నారు. ఎవ్వరు చెప్పింది కేసీఆర్ వినరు.. ఆయనకు తెలియదన్నారు. రాచరికం మీద పోరాటం చేసిన సమ్మక్క సారలమ్మ స్పూర్తితో మేడారం నుంచి యాత్ర చేపట్టామని రేవంత్ చెప్పారు. ఏ కార్యక్రమం చేపట్టినా ఆడపిల్ల ఎదురు రావాలనుకుంటాం.. సీతక్క ఆడబిడ్డగా ఆమె ప్రాతినిధ్యం వహించే మేడారం నుంచి మొదలుపెట్టామన్నారు. రాష్ట్రానికి మంచి జరుగుతుందన్నారు. ముందస్తు ఎన్నికలు పిచ్చోడి చేతిలో రాయి లాంటివన్నారు. చంద్రశేఖర్ రావు పీడ విరగడానికే యాత్ర చేస్తున్నామన్నారు.
Bandi Sanjay: బడ్జెట్ అంతా డొల్ల.. శుష్క వాగ్దానాలు-శూన్య హస్తాలే..
బడ్జెట్‌పై ఎప్పుడూ కేసీఆర్ అబద్ధాలే చెబుతారని రేవంత్ రెడ్డి విమర్శించారు. జీరో బడ్జెట్‌గా ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్‌ను భావిస్తున్నామన్నారు. కేసీఆర్ వచ్చాక 30 శాతం బడ్జెట్‌లో తేడా వచ్చిందని.. భూ ప్రపంచంలో ఇంత వ్యత్యాసం ఉన్న బడ్జెట్ ఎవ్వరు ప్రవేశపెట్టలేదన్నారు. ఇచ్చేది ఏమి లేదు కాబట్టి రాసుకోరా సాంబా అంటే రాసుకుని చదివిండని మంత్రి హరీశ్ రావును ఉద్దేశించి ఆరోపించారు. భవిష్యత్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందన్నారు. సీతక్క నికార్సైన కార్యకర్త… ఆమె నిబద్ధత గల నాయకురాలు కావడంతో ఆమె ప్రాతినిధ్యం వహించే మేడారం నుంచి యాత్ర చేపట్టామన్నారు. .