Etela Rajender : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. గులాబీ పార్టీలో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈటల మాట్లాడుతూ, కేసీఆర్ ఒకరిపై నెగటివ్ అభిప్రాయం పెంచుకుంటే ఇక ఆయనను ఒప్పించటం అసాధ్యమని అన్నారు. కవిత విషయంలోనూ ఇదే జరిగింది…
మేము ఆ రెండు పార్టీలకి జవాబు దారి కాదని కాంగ్రెస్, బీఆర్ఎస్ని ఉద్దేశించి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఎన్ని తిట్టినా తమకు పోయేదేమీ లేదని స్పష్టం చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రెండు పార్టీలో ఒకరికొకరు ఒప్పందం కుదుర్చుకొని బీజేపీపై దాడి చేస్తున్నాయని ఆరోపించారు.. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ దోచుకుంటున్నారని విమర్శించారు.
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లో ఒకేలా సీన్లు రిపీట్ అవుతున్నాయన్నారు. తండ్రులు సంపాదించిన ఆస్తుల పంపకాల్లో, రాజకీయ పదవుల్లో పంపకాల్లో తేడాలున్నాయని.. అన్నలు వదిలిన బాణాలు.. అన్నల మీదికే చెల్లెలు గురిపేడుతున్నారన్నారు.
కుల గణనపై తెలంగాణ బీజేపీ నేతలకు నిద్ర పట్టడం లేదని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అసెంబ్లీలో జరిగిన చర్చలో బీజేపీ, సీపీఐ, బీఆర్ఎస్ కూడా పాల్గొన్నట్లు తెలిపారు. క్షేత్ర స్థాయికి సర్వే వెళ్ళిందని.. కిషన్ రెడ్డికి ఈ విషయం తెలుసుకోవాలన్నారు. ఇంటి ఇంటికి అధికారులు వెళ్లి సర్వే చేశారన్నారు. కుల గణనపై కిషన్ రెడ్డి చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. రేవంత్ సక్సెస్ అయ్యాడు కాబట్టి డైవర్ట్ చేసి బురద జల్లే ప్రయత్నం చేయకండన్నారు.
తెలంగాణ బీజేపీ అనుకున్నది సాధించగలిగిందా? ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్‌లో వేరే పార్టీ సభ్యుల ఓట్లు కమలానికి పడ్డాయా? ఉన్నబలంకంటే ఒక్కటి రెండు ఓట్లు ఎక్కువ సాధించినా సక్సెస్ అయినట్టేననన్న కాషాయ దళం ఆశలు నెరవేరే అవకాశ ఉందా? ఈ విషయమై ఎలాంటి చర్చ జరుగుతోంది పార్టీలో? హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ముగిసింది. శుక్రవారంనాడు ఫలితం వస్తుంది. ఈ క్రమంలో బీజేపీ ఆడిన మైండ్ గేమ్ ఎంతవరకు వర్కౌట్ అయింది? ఆ పార్టీ అనుకున్నది…
కాషాయదళం తెలంగాణలో దూకుడు పెంచాలనుకుంటోందా? అందుకు స్పెషల్ ప్లాన్స్ సిద్ధమవుతున్నాయా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలంటే ముంది కింది నుంచి రావాలని పార్టీ ముఖ్యులు ఫిక్స్ అయ్యారా? అందుకు ఏం చేయాలనుకుంటున్నారు? ఆ కొత్త ప్లాన్ ఏంటి? తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు జూన్‌లో జరగవచ్చన్నది కమలనాధుల అంచనా అట. అందుకే ఇప్పటి నుండే కసరత్తు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థలు బలపడాలంటే… బీజేపీ గెలవాలన్న నినాదంతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నట్టు సమాచారం. గ్రామాలకు కేంద్ర…
Kishan Reddy: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేడు జరిగిన బీజేపీ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రజాకార్లు, మజ్లిస్ పార్టీ ఎలాంటి దుర్మార్గాలు చేశారో అందరికీ తెలుసునని, అలాంటి దుర్మార్గాలు చేసి ప్రజల రక్తం తాగిన మజ్లిస్ పార్టీ కి కాంగ్రెస్, బీఆర్ఎస్ లు జి హుజూర్ అంటూ సలాం కొడుతున్నాయని అన్నారు. ఈ సంగతి ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనిపించిందని.. కాంగ్రెస్, బీఆర్ఎస్…
Kishan Reddy: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాతో జరిగిన చిట్‌చాట్ సందర్భంగా పలు కీలక అంశాలపై స్పందించారు. తనను జాతీయ అధ్యక్షుడిగా నియమించనున్నట్టు వస్తున్న ప్రచారాలను ఖండిస్తూ.. ఇప్పటి వరకు దక్షిణాదిలో కేవలం రెండు రాష్ట్రాలకే అధ్యక్షుల నియామకం జరిగిందని, నన్ను జాతీయ అధ్యక్షుడిగా చేయాలన్న ప్రతిపాదన ఎక్కడా లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన అంశం ప్రస్తుతం పార్టీలో కానీ, కేంద్ర ప్రభుత్వంలో కానీ చర్చలో లేదని తెలిపారు. ప్రజల ఆలోచనలు,…
దేశం, ధర్మం కోసం త్యాగం చేసిన సమాజంగా సిక్కుల సమాజం గుర్తింపు పొందిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. వారి త్యాగం వెలకట్టలేనిదన్నారు. ఆదివారం బైశాఖి దినోత్సవం సందర్భంగా అమీర్ పేట్ లోని సిక్కు సోదరుల పవిత్ర ప్రార్థన మందిరాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. అనేక సంవత్సరాలుగా అమీర్ పేట్ లోని ఈ గురుద్వారా ప్రబంధక్ కమిటీ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తూ తమ భక్తిని చాటుకుంటుందన్నారు.…
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జెండాను కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. బీజేపీని స్థాపించిన తొలినాళ్లలో చాలామంది పార్టీని తక్కువచేసి చూశారని, అధికారంలోకి రావడం సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయని ఆయన గుర్తుచేశారు. అయితే అనేకమంది బీజేపీ కార్యకర్తలు నక్సలైట్లు, పాకిస్థాన్ ఐఎస్ఐకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన విషయాన్ని చెప్పారు. జాతీయ భావజాలం కోసం ప్రాణత్యాగం చేసిన వారందరికీ…