తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా... నిర్వహణపై నీలి నీడలు మాత్రం తొలిగిపోలేదు. ఎలక్షన్స్ జరుగుతాయా? లేదా? అన్న అనుమానాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. బీసీలకు 42 శాతం సీట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకు సంబంధించి జీవో ఇవ్వడంతోపాటు ప్రాదేశిక నియోజకవర్గంలో కూడా 42 శాతం రిజర్వేషన్ అమలుకు నిర్ణయించింది.
తాము నిరక్షరాస్యులం ఏమీ కాదని.. బీసీ రిజర్వేషన్లు, ఆర్డినెన్స్ గురించి తెలుసు అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పక్క రాష్టాల్లో రిజర్వేషన్లను న్యాయస్థానాలు కొట్టి వేసాయని, తమ్మల్ని మోసం చేయాలని చూస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల కోసం అవసరం అయితే కర్నాటక వెళ్లి సీఎం సిద్ధ రామయ్యతో చర్చిస్తాం అని పేర్కొన్నారు. ఇంజనీరింగ్, మెడికల్ అడ్మిషన్లు జరుగుతున్నాయని.. మరి వాటికి బీసీ రిజర్వేషన్ల జీవో ఎందుకు ఇవ్వలేదని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.…