తాము నిరక్షరాస్యులం ఏమీ కాదని.. బీసీ రిజర్వేషన్లు, ఆర్డినెన్స్ గురించి తెలుసు అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పక్క రాష్టాల్లో రిజర్వేషన్లను న్యాయస్థానాలు కొట్టి వేసాయని, తమ్మల్ని మోసం చేయాలని చూస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల కోసం అవసరం అయితే కర్నాటక వెళ్లి సీఎం సిద్ధ రామయ్యతో చర్చిస్తాం అని పేర్కొన్నారు. ఇంజనీరింగ్, మెడికల్ అడ్మిషన్లు జరుగుతున్నాయని.. మరి వాటికి బీసీ రిజర్వేషన్ల జీవో ఎందుకు ఇవ్వలేదని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ.. ఈ నెల 10న రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. బీసీ డెడికేటెడ్ కమిషన్ బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసే పనిలో పడింది.
Also Read: Ravindra Jadeja: హీరోనా లేదా విలనా?.. లార్డ్స్‌లో జడేజా ఇన్నింగ్స్‌పై దిగ్గజాలు ఏమన్నారంటే?
‘కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను ఒక బీసీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యతో చెప్పించారు. 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అప్పుడు కాంగ్రెస్ నేతలు పెద్ద నాయకులతో చెప్పించారు. బీసీ రిజర్వేషన్ల కోసం అవసరం అయితే కర్నాటక వెళ్లి సిద్ధ రామయ్యతో చర్చిస్తాం. నాడు 33 శాతం రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తే.. స్వప్న రెడ్డితో కేసు వేయించి కొట్టి వేయించారు. మేము నిరక్షరాస్యులం కాదు.. బీసీ రిజర్వేషన్లు, ఆర్డినెన్స్ గురించి తెలుసు. పక్క రాష్టాల్లో రిజర్వేషన్లను న్యాయస్థానాలు కొట్టివేశాయి. మమ్మల్ని మోసం చేయాలని చూస్తే ఖబడ్దార్. మీ మాటలతో పిచ్చి వాల్లను, హౌలా గాళ్లను చేయకండి. కేబినెట్‌లో యాదవ్, గొల్ల కురుమలకు స్థానం లేదు. ఒక జీవోతో రిజర్వేషన్లు ఇస్తామనడం మోసం. అలా ఒక జీవోతో రిజర్వేషన్లు వచ్చేది ఉంటే ఇన్ని ఉద్యమాలు, గొడవలు ఎందుకు అవుతున్నాయి. 42 శాతం రిజర్వేషన్లు కల్పించి చట్టబద్ధత కల్పించకుంటే మిమ్మల్ని రాజకీయంగా భూస్థాపితం చేస్తాం. ఇంజనీరింగ్, మెడికల్ అడ్మిషన్లు జరుగుతున్నాయి. వాటికి బీసీ రిజర్వేషన్ల జీవో ఎందుకు ఇవ్వలేదు’ అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.