Telangana Assembly Sessions: శాసనసభ, శాసనమండలి తిరిగి సమావేశం అయ్యాయి. ఇక ఐదు రోజుల విరామం అనంతరం ఇవాళ ఉదయం సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్లోనూ ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. దీంతో నేరుగా స్వల్పకాలిక చర్చ చేపడతారు. దీంతో.. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ బిల్లు, దాని ప్రభావాలపై అసెంబ్లీ, కౌన్సిల్‌లో చర్చ జరగనుంది. ఇక కేంద్రం ప్రతిపాదిస్తున్న విద్యుత్ బిల్లు వల్ల రాష్ట్రంలో రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతుందని పదేపదే చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, ఉభయసభల వేదికగా…