Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గురువారం భూపాలపల్లిలో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఈ నెల 18న ములుగు నియోజకవర్గంలో బస్సుయాత్ర ప్రారంభించారు.
Telangana BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు కొనసాగుతుంది. ఈనేపథ్యంలో ఇవాళ ఢిల్లీలో తెలంగాణ బీజేపీ నేతల కీలక భేటీ అయ్యారు. ఇప్పటికే ఢిల్లీకి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, ఈటల రాజేందర్ చేరుకున్నారు.
Telangana BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రానున్న ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని జనసేన పార్టీని బీజేపీ కోరింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ భేటీ అయ్యారు.
BJP Meeting: బీజేపీ వివిధ రాష్ట్రాల్లో పార్టీ ఉనికిని బలోపేతం చేయడానికి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా నివాసంలో కోర్ గ్రూప్ సమావేశాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.
Congress First List: ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన 12 మంది నేతలకు టిక్కెట్ల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసింది. గెలుపు గుర్రాలకే టికెట్ల కేటాయింపులో భాగంగా వలస నేతలకే టికెట్లు కేటాయించాల్సి వచ్చిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
CLP Leader Mallu Bhatti Vikramarka Slams BRS: తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే.. ఆరు పథకాలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. రాష్ట్ర సంపద, వనరులను ప్రజలకు పంచుకోవడం కోసం తెచ్చుకున్న ప్రత్యేక తెలంగాణను.. దశాబ్ద కాలంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వ పెద్దలు దోచుకుంటున్నారన్నారు. ఖమ్మం జిల్లా మధిర క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న భట్టి…
Congress Candidates List likely to be finalized tomorrow: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ డేట్ వచ్చేయడంతో ‘ఎన్నికల యుద్ధం’ మొదలైపోయింది. ప్రధాన పార్టీలు తమ తమ అభ్యర్ధుల జాబితాకు తుది మెరుగులు దిద్దుతున్నాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న ‘కాంగ్రెస్ పార్టీ’.. అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తోంది. గెలిచే సత్తా ఉన్న వారినే బరిలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అభ్యర్ధుల జాబితాపై స్క్రీనింగ్ కమిటీ ముమ్మర కసరత్తు చేస్తోంది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు…
Arepally Mohan: మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్, జాయినింగ్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీలో చేరనున్నారు.
BRS Leaders: కారు గుర్తులను ఏ పార్టీకి కేటాయించవద్దని ఎన్నికల కమిషన్‌కు నివేదించిన నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది.
Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు(మంగళవారం) తెలంగాణలో పర్యటించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తొలిసారిగా అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. ఈ మేరకు బీజేపీ అన్ని ఏర్పాట్లను చేపట్టింది.