Congress Candidates List likely to be finalized tomorrow: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ డేట్ వచ్చేయడంతో ‘ఎన్నికల యుద్ధం’ మొదలైపోయింది. ప్రధాన పార్టీలు తమ తమ అభ్యర్ధుల జాబితాకు తుది మెరుగులు దిద్దుతున్నాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న ‘కాంగ్రెస్ పార్టీ’.. అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తోంది. గెలిచే సత్తా ఉన్న వారినే బరిలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అభ్యర్ధుల జాబితాపై స్క్రీనింగ్ కమిటీ ముమ్మర కసరత్తు చేస్తోంది.
శుక్రవారం సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. కాంగ్రెస్ అభ్యర్ధులను కేంద్ర ఎన్నికల కమిటీ ఖారారు చేసినా.. ‘బస్సు యాత్ర’ తర్వాతే ప్రకటించే అవకాశం ఉంది. ఈ నెల 14 తర్వాత మరికొన్ని చేరికలు ఉండే అవకాశం ఉంది. ఆఖరి నిముషంలో చేరికలు కూడా ఉంటాయని తెలుస్తోంది. ఒకేసారి అభ్యర్ధుల జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Virat Kohli: అయ్యర్ భయ్యా.. ఒక్క సింగిల్ తీయవా?! విరాట్ కోహ్లీ వీడియో వైరల్
ఢిల్లీలో జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరుకానున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి థాక్రేలు సమావేశంలో పాల్గొననున్నారు. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్దుల జాబితా దాదాపుగా రేపు ఖరారు అయ్యే అవకాశం ఉంది.