Chevella: తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని మీర్జాపూర్ దగ్గర చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో.. ఆర్టీసీ బస్సును కంకర టిప్పర్ ఢీ కొట్టడంతో 24 మంది మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
SLBC Incident : తెలంగాణలోని SLBC (శ్రీశైలం లిఫ్ట్ బకింగ్ కెనాల్) టన్నెల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది సజీవ సమాధి అయ్యారు. మృతుల్లో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజనీర్లు ఉన్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచే అధికారులు, రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి క్షతగాత్రుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మట్టిలో వారు మూడు మీటర్ల లోతులో కూరుకుపోయినట్లు అధునాతన పరికరాలు సూచించాయి. గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ మెషీన్ ద్వారా మట్టి లో కూరుకుపోయిన 5…
SLBC Tunnel: తెలంగాణలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) టన్నెల్‌లో సంభవించిన ఘోర ప్రమాదం కారణంగా సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ రక్షణ చర్యల్లో వందలాది మంది పాల్గొంటున్నారు. భారత సైన్యం ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు కూడా చేయబడింది. ఇక తాజాగా సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటికి తీసేందుకు అధికారులు ర్యాట్ హోల్ మైనర్స్‌ను రంగంలోకి దించారు. ప్రత్యేకంగా ఆరుగురు ర్యాట్ హోల్ మైనర్లు ఢిల్లీ నుండి…
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. 8 గంటలవుతున్నా ఇంకా ఎనిమిది మంది ఆచూకీ లభించలేదు. శిథిలాల్లోనే 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. మరోవైపు.. సంఘటనా స్థలంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.