Chevella: తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని మీర్జాపూర్ దగ్గర చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో.. ఆర్టీసీ బస్సును కంకర టిప్పర్ ఢీ కొట్టడంతో 24 మంది మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇక, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తున్నాను.. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను అన్నారు.
Read Also: Rohit Sharma: తాను సాధించలేకపోయినా.. మహిళల గెలుపుతో కన్నీరు పెట్టుకున్న హిట్ మ్యాన్..!
మరోవైపు, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొట్టడంతో పలువురు మృత్యువాత పడటం హృదయం ద్రవించిపోయింది అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మృతులకు అశ్రు నివాళులు అర్పిస్తున్నాను.. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను.. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని నారా లోకేష్ వెల్లడించారు.