తెలంగాణ పిసిసి అద్యక్షుడుగా రేవంత్ రెడ్డి నియామకం కాంగ్రెస్‌లోనూ రాష్ట్ర రాజకీయాల్లోనూ ముఖ్య పరిణామం అవుతుంది. ఎడతెగని వివాదాలను అంతర్గత విభేదాలను పక్కనపెట్టి అధిష్టానం రేవంత్‌ను ఎంపిక చేయడంలో ఆయనపై విశ్వాసంతో పాటు ఆ పార్టీ పరిస్తితి కూడా అర్థమవుతుంది. ఎప్పటినుంచో వున్న పిసిపి పీఠం ఆశిస్తున్న హేమాహేమీలను కాదని, గత ఎన్నికల ముందు టిడిపి నుంచి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌నే ఎంచుకున్నారంటే కెసిఆర్ ప్రభుత్వాన్ని ఢీకొనగల సత్తా ఆయనకే వుందని నాయకత్వం భావించిందన్న మాట. బండిసంజయ్…
కలెక్టరేట్‌ల కమిషనరేట్ల ప్రారంభాలు.. పెద్ద వైద్యశాలల శంకుస్థాపనలూ, దత్తత గ్రామస్తులతో సహపంక్తిభోజనం ఆపైన చమత్కార ప్రసంగం,,యాదాద్రి ఆలయ నిర్మాణ పర్యవేక్షణ, షరా మామూలుగా సమీక్షలు ఆదేశాలు కీలక నిర్ణయాలు.. ఏడేళ్ల తర్వాత కాంగ్రెస్ నాయకులకు అపాయింట్‌మెంట్ లాకప్‌డెత్‌పై విచారణ బాధిత కుటుంబానికి ఉద్యోగ కల్పన, ఆ పైన దళిత సంక్షేమంపై అఖిలపక్ష చర్చ అందుకోసం స్వయంగా ఫోన్లు., ఎపితో నీటివివాదంపై తీవ్ర భాషలో మంత్రుల దాడి..పివి నరసింహారావు శతజయంతి వేడుకల ముగింపు సభలు ఒకటేమిటి.. ముఖ్యమంత్రి కెసిఆర్…
ఎపి ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నేతగావున్నప్పుడు జరిగిన ఆందోళనలు నిరసనలు కొన్ని ఉద్రిక్త సంఘటనలకు సంబంధించి దాఖలైన 11 కేసులను రద్దుచేయడంపై హైకోర్టు జడ్జి కె.లలిత సుమోటాగా విచారణ చేపట్టడం ఇప్పుడు తాజా వివాదంగా వుంది. ప్రభుత్వాలు మారినపుడు అంతకు ముందరి సాధారణ కేసులు కొన్ని రద్దు చేయడం జరుగుతుంటుంది.వాటినిప్రతిపక్షం ఆక్షేపించడం కూడా జరుగుతుంటుంది గాని ఇక్కడ హైకోర్టు సుమోలాగా తనకు తాను తీసుకోవడవంపైనే ప్రభుత్వం అభ్యంతరం చెబుతున్నది.ఈ కేసుల రద్దులో కొన్ని ప్రభుత్వ జీవోల ద్వారానూ…
సినిమా పరిశ్రమ దానికదే ఒక ప్రత్యేక ప్రపంచమైనా ప్రచారం ప్రభావం ఆకర్షణ చాలా ఎక్కువగా వుంటాయి. నటుల రాజకీయ ప్రవేశం ప్రభుత్వాల ఏర్పాటు అనుకూల వ్యతిరేక రాజకీయాల కారణంగా ఇది మరింత పెరుగుతుంటుంది. తెలుగు సినిమా నటీనటుల సంఘం మా ఎన్నికలు అందుకే గత రెండు మూడు పర్యాయాలుగా చాలా ఆసక్తి పెంచుతున్నాయి. పోటీలో వున్న అభ్యర్థులు ఎవరన్నది ఒకటైతే వారిని బలపర్చేవారెవరూ ఎవరి బలం ఎంత వంటి ప్రశ్నలు ముందుకు తెస్తున్నాయి. ఈసారి ప్రకాశ్ రాజ్…
జనసేన అధినేత,సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను బిజెపి రాజ్యసభకు పంపిస్తుందని కొన్ని రోజులుగా కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఆయనను కేంద్ర క్యాబినెట్‌లోకి కూడా తీసుకుంటారని తర్వాత ఈ కథలు విస్తరించాయి.సోషల్‌మీడియాలో మొదలైన ఈ కథలు నెమ్మదిగా ఉధృత ప్రచారంగా మారాయి.ఇంతకూ వీటిలో వాస్తవమెంత?జనసేన నాయకులు వీటి గురించి ఏమంటున్నారు?మొదటి విషయం ఇవి పూర్తిగా నిరాధారమైనవని జనసేన ముఖ్యనాయకులు కొట్టిపారేస్తున్నారు.బిజెపి నుంచి అలాటి ప్రతిపాదన ఏదీ రాలేదని వచ్చినా పవన్ ఒప్పుకోరని చెబుతున్నారు.తెలుగుదేశంతో పొత్తు వున్నప్పుడే అలాటి ఆఫర్లు…