తెలకపల్లి రవి : పవన్ కళ్యాణ్ కేంద్ర పదవిపై కావాలనే కథలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేన అధినేత,సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను బిజెపి రాజ్యసభకు పంపిస్తుందని కొన్ని రోజులుగా కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఆయనను కేంద్ర క్యాబినెట్‌లోకి కూడా తీసుకుంటారని తర్వాత ఈ కథలు విస్తరించాయి.సోషల్‌మీడియాలో మొదలైన ఈ కథలు నెమ్మదిగా ఉధృత ప్రచారంగా మారాయి.ఇంతకూ వీటిలో వాస్తవమెంత?జనసేన నాయకులు వీటి గురించి ఏమంటున్నారు?
మొదటి విషయం ఇవి పూర్తిగా నిరాధారమైనవని జనసేన ముఖ్యనాయకులు కొట్టిపారేస్తున్నారు.బిజెపి నుంచి అలాటి ప్రతిపాదన ఏదీ రాలేదని వచ్చినా పవన్ ఒప్పుకోరని చెబుతున్నారు.తెలుగుదేశంతో పొత్తు వున్నప్పుడే అలాటి ఆఫర్లు వచ్చాయి. వాటిని పవన్ కళ్యాణ్ తోసిపుచ్చారు. వాస్తవానికి ఆ పార్టీ అధికారంలోకి రావడంలో తమ పాత్ర కూడా తక్కువేమీ కాదు గనక రాజ్యసభకు వెళ్లినా తప్పు వుండేది కాదన్న భావన ఆ పార్టీలో వుండిరది. కాని ఇప్పుడు అచ్చంగా బిజెపిపై ఆధారపడి రాజ్యసభకువెళల్డం జరిగేపని కాదని వారు అంత తేలిగ్గా ఇచ్చేవారూ కాదని జనసేన భావిస్తున్నది.
తమ పార్టీని రద్దు చేసి బిజెపిలో విలీనం చేస్తే తప్ప విడిగా వుంటే రాజ్యసభకు పంపే పరిస్థితి బిజెపి వంటి పార్టీలో వుండబోదని కూడా స్పష్టంగా చెబుతున్నారు. గతంలోనే అమిత్ షా బిజెపి అద్యక్షుడుగా వున్నప్పుడే విలీనం ప్రతిపాదనను పవన్ బహిరంగంగా తోసి పుచ్చారని అంతేగాక అలా అడగడం తప్పని కూడా విమర్శించారని వారు గుర్తుచేశారు.ఇప్పుడు రాజకీయ అవసరాల రీత్యా వ్యూహాత్మకంగా బిజెపితో కలసి పనిచేస్తున్నంత మాత్రాన వారితో కలసి పోవడానికి లేదా ఆధారపడటానికి పవన్ ఎప్పటికీ అంగీకరించబోరని ఒక సీనియర్ నాయకుడు వివరించారు.బిజెపి నేతలు కూడా పవన్‌కు కేంద్ర పదవి అన్న దానిపై ఎలాటి స్పందన వ్యక్తం చేయలేదు. మరి అలాటప్పుడు అసలు ఈ కథనం లేదా లీకేజీ ఎలా వచ్చిందనే దానిపైనా జనసేనకు సందేహాలున్నాయి.
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
ఇప్పుడున్న పరిస్థితులలో తెలుగుదేశం దాని అనుకూల మీడియా సంస్థలు కావాలనే ఈ కథనాన్ని వదిలాయని నెమ్మదిగా అందరూ అందుకున్నారని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రంలోబిజెపి తమతో మనస్పూర్తిగా కలసి పనిచేయడం లేదనీ వారిలో చాలామందిపై టిడిపి వైసీపీ ప్రభావాలు వున్నాయనికూడా జనసేన అంచనాగా వుంది. బిజెపికి ఏకపక్షంగా మద్దతు ప్రకటిస్తున్న టిడిపి ఈ కథనాలను ప్రచారంలో పెట్టి తర్వాత ఖండనలు తెప్పించి తమ ప్రతిష్టకు భంగం కలిగించాలనుకుంటోందని కూడా ఆ సీనియర్ నాయకుడు ఆరోపించారు. దీనివెనక కొందరు బిజెపి వారి హస్తం కూడావుండవచ్చునని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితులలో పవన్ కళ్యాణ్ కొన్ని సినిమాలు పూర్తి చేసే పనిలో వుంటే కేంద్ర మంత్రి పదవి వంటి రాజకీయ బాధ్యతలు తీసుకోవడం గురించి ఎలా అలోచిస్తారని కూడా ప్రశ్నించారు
తాజావార్తలు
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
ట్రెండింగ్
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!