Nitish Kumar: తొమ్మిది సార్లు బీహార్ సీఎంగా నితీష్ కుమార్.. పదోసారి పీఠం దక్కేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar: బీహార్ ఎన్నికల ఫలితాలు వెలుడనున్నాయి. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో రెండు దశల్లో ఓటింగ్ జరిగింది. నవంబర్ 6న మొదటి దశ పోలింగ్ జరిగింది. ఇందులో 65 శాతం ఓటర్లు ఓటు వేశారు. నవంబర్ 11న జరిగిన రెండవ దశ పోలింగ్‌లో దాదాపు 69 శాతం ఓటర్లు ఓటు వేశారు. ఇప్పుడు నితీష్ కుమార్ తిరిగి అధికారంలోకి వస్తారా లేదా తేజస్వి యాదవ్ కల నెరవేరుతుందా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. నితీష్ 20 సంవత్సరాలుగా బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తొమ్మిది సార్లు బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. పదోసారి అధికార పీఠం దక్కుతుందా..? అనే అంశం నేడు తెలనుంది. కాగా.. నితీష్‌కుమార్ రాజకీయ ప్రస్తానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
READ MORE: Astrology: నవంబర్ 14, శుక్రవారం దినఫలాలు..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
పట్నా సమీపంలోని ఓ భక్తియార్‌పుర్‌లో 1951లో నితీష్ కుమార్ జన్మించారు. ఆయన తండ్రి స్వాతంత్ర్య సమరయోధుడు, ఆయుర్వేద వైద్యుడు. బీహార్ ఇంజినీరింగ్ కాలేజ్ (ప్రస్తుతం పట్నా ఎన్‌ఐటీ)లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తిచేసిన నితీష్.. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించేవారు. జయప్రకాశ్ నారాయణ్ చేపట్టిన ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే లాలూ ప్రసాద్, సుశీల్ కుమార్ మోడీ వంటి నేతలతో పరిచయం ఏర్పడింది. 1985 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించినప్పటికీ.. నితీష్ లోక్‌దళ్ పార్టీ తరఫున హర్నౌత్ నుంచి గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఐదేళ్ల తర్వాత ఎంపీగా ఎన్నికయ్యారు. బీహార్‌లో రిజర్వేషన్ల ఉద్యమం కొనసాగుతోన్న తరుణంలో జార్జ్ ఫెర్నాండెజ్‌తో కలిసి 1994లో సమతా పార్టీని ఏర్పాటు చేశారు. తొలిసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన ఆయన కేవలం వారం రోజులే (2000 మార్చి 3- 10) కొనసాగారు. అనంతరం జనతాదళ్ (యునైటెడ్)ను ఏర్పాటు చేసి.. రాష్ట్రంలో మిత్రపక్షాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
READ MORE: Jubilee Hills Bypoll Results: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్‌కు సర్వ సిద్ధం.. ఫలితంపై ఉత్కంఠం..!
2005లో బీహార్ ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టిన నితీష్ కుమార్.. మొదటి ఐదేళ్లలో దూకుడుగా వ్యవహరించారు. ప్రత్యర్థులపై దాడులు, డబ్బుల కోసం కిడ్నాప్‌లతో రాష్ట్రం అట్టుడికిపోతున్న తరుణంలో శాంతిభద్రతలను గాడిన పెట్టి విమర్శకుల మన్ననలు పొందారు. బీజేపీతో మిత్రపక్షంగా కొనసాగుతూనే ముస్లిం (పస్మందా) వర్గానికి చేరువయ్యే ప్రయత్నం చేశారు. 2014 మే వరకు అధికారంలో కొనసాగారు. 2013లో బీజేపీకి బ్రేకప్ చెప్పిన నితీష్ కుమార్.. కాంగ్రెస్, సీపీఐ సాయంతో ప్రభుత్వాన్ని కొనసాగించారు. తదుపరి ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధికారం నుంచి వైదొలిగారు. ఆ సమయంలో తొమ్మిది నెలలపాటు జితన్‌రామ్ మాంఝీ సీఎంగా కొనసాగారు. 2015లో జేడీయూ, కాంగ్రెస్, ఆర్జేడీ కలిపి మహా కూటమిగా ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి.
READ MORE: Bihar Assembly Election Results: నేడే బీహార్ ఎన్నికల ఫలితాలు.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఫలించేనా..?
అది రెండేళ్లపాటే కొనసాగింది. ఉపముఖ్యమంత్రిగా ఉన్న తేజస్వీ యాదవ్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో నిర్ణయాన్ని మార్చుకున్న నితీష్.. 2017లో తిరిగి ఎన్‌డీఏ గూటికి చేరారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ పరాజయానికి కారణం బీజేపీనే అని భావించిన నితీష్ కుమార్.. 2022లో మళ్లీ ఎన్‌డీఏను వీడారు. తిరిగి మహాకూటమికి చేరువైన ఆయన.. సీఎంగా బాధ్యతలు చేపట్టి 18నెలలు గడవక ముందే మళ్లీ కాషాయ పార్టీతో దోస్తీకి సై అన్నారు. మిత్రపక్షాలను మార్చడం ద్వారా బీహార్‌లో సుదీర్ఘ కాలంగా అధికారంలో కొనసాగుతున్న నితీష్ కుమార్.. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ‘ఇండియా’ కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. పట్నా వేదికగా విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారు. అయితే, ‘ఇండియా’ కూటమి కన్వీనర్‌గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికైనప్పటి నుంచి నితీష్ అసంతృప్తికి లోనయ్యారు. ఈ క్రమంలోనే ‘ఇండియా’ కూటమిని వీడి తిరిగి ఎన్డీయే గూటికి చేరి తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!