Teja: దాదాపు ఇరవై మూడేళ్ళ క్రితం ఓ సినిమాటోగ్రాఫర్ కెమెరా వ్యూఫైండర్ లో నుండి అదే పనిగా చూడటం మానేసి, మెగాఫోన్ పట్టి డైరెక్టర్ అయ్యారు. చిత్రంగా తొలి సినిమాకే 'చిత్రం' అని పేరు పెట్టారు. ఆ మూవీ సైతం 'చిత్రం'గానే ఘనవిజయం సాధించింది. ఒక్కసారిగా సినీజనం అందరి కళ్ళు అటువైపు చూశాయి.