ఏప్రిల్ 28 ఆదివారం సిల్హెట్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఐదు మ్యాచ్ల సిరీస్లో మొదటి టి20 లో భారత మహిళల క్రికెట్ జట్టు తమ బంగ్లాదేశ్ ప్రత్యర్థులను 44 పరుగుల తేడాతో ఓడించింది. 146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 101/8 పరుగులకే ఆలౌటైంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా 145 పరుగులను ఏడు వికెట్లు కోల్పోయి సాధించింది. ఇక టీమిండియా బ్యాటింగ్ లో షిఫాలీ వర్మ 31, ఎస్తిక 36,…
టీమిండియా మాజీ క్రికెటర్ ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడైన మహేంద్ర సింగ్ ధోనీకి బైక్స్ పై ఉన్న ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు ఉన్న వాహనాలకు ఓ పెద్ద షోరూం ఓపెన్ చేయొచ్చు అంటే నమ్మండి. అతడికి ఉన్న గ్యారేజీలో ఎన్నో రకాల బైకులు, కార్లు ఉన్నాయి. ఇకపోతే తాజాగా ఈయన ఓ ఈ – సైకిల్ ను కొత్తగా కొన్నాడు. ఇక ఈ – సైకిల్ గురించి వివరాలు…
టీమిండియా మాజీ ఆటగాడు, ప్రముఖ రాజకీయ నాయకుడు, టెలివిజన్ వ్యాఖ్యాత నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దాదాపు దశాబ్ద కాలం విరామం తర్వాత కామెంటరీ చేయబోతున్నాడు సిద్ధూ. మరో 2 రోజుల్లో మొదలు కాబోతున్న ఐపీఎల్ 2024 సీజన్ తో వ్యాఖ్యాతగా సిద్ధూ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ విషయాన్ని ఐపీఎల్ బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ వెల్లడించింది. నిజానికి సిద్ధూ కామెంటరీ కాస్త ప్రత్యేకంగా ఉంటుంది. సిద్ధూ ఉన్నంతసేపు…
బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. బౌలింగ్ చేస్తున్న సమయంలో హార్దిక్ పాండ్యా కాలుకు బంతి తగిలింది. దీంతో మ్యాచ్ మధ్యలోనే గ్రౌండ్ నుంచి బయటికి వెళ్లిపోయాడు. అయితే చిన్న దెబ్బ కదా.. మళ్లీ వస్తాడని అందరూ అనుకున్నారు. కానీ దెబ్బ బలంగా తాకడంతో న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్ లో కూడా ఆడలేకపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ అంటే ఇరుజట్ల మధ్య గట్టిపోటీ ఉంటుంది. ఈ మ్యాచ్‌లో హార్దిక్…
ప్రపంచకప్ 2023 కోసం టీమిండియా జట్టును ప్రకటించింది. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో స్టార్ స్పిన్నర్ ఆర్. అశ్విన్ జట్టులోకి వచ్చాడు. గాయం కారణంగా అక్షర్ పటేల్ జట్టుకు దూరమయ్యాడు.
అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో.. టీమిండియా ఆటగాళ్లు.. భారత్ అని రాసి ఉన్న జెర్సీలతోనే క్రికెట్ ఆడాలని ఆయన సూచించారు. ఈ మేరకు బీసిసిఐ కార్యదర్శి అమిత్ షా కొడుకు జై షా కు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ విజ్ఞప్తి చేశారు.
టీమిండియా నయా సంచలనం రింకూ సింగ్ మరోసారి తన బ్యాటింగ్ పవర్ ఏంటో చూపించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను మరోసారి గుర్తు చేసే విధంగా సూపర్ ఓవర్ లో ఓ మ్యాచ్ ను రింకూ సింగ్ ఫినిష్ చేశాడు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి మీడియా హక్కులను వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీకి చెందిన వయాకామ్18 కంపెనీ దక్కించుకుంది. ఈ సంస్థ టీమిండియా స్వదేశంలో ఆడే మ్యాచ్‌ల టీవీ ప్రసార హక్కులతో పాటు డిజిటల్ హక్కులను కూడా సొంతం చేసుకుంది.
తొలి బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ గేమ్స్ ఫైనల్లో టీమిండియా పురుషుల అందుల క్రికెట్ జట్టుకు నిరాశ ఎదురైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా నిన్న (శనివారం) పాకిస్తాన్తో జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో భారత జట్టు ఓటమి పాలైంది.