ఏప్రిల్ 28 ఆదివారం సిల్హెట్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఐదు మ్యాచ్ల సిరీస్లో మొదటి టి20 లో భారత మహిళల క్రికెట్ జట్టు తమ బంగ్లాదేశ్ ప్రత్యర్థులను 44 పరుగుల తేడాతో ఓడించింది. 146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 101/8 పరుగులకే ఆలౌటైంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా 145 పరుగులను ఏడు వికెట్లు కోల్పోయి సాధించింది. ఇక టీమిండియా బ్యాటింగ్ లో షిఫాలీ వర్మ 31, ఎస్తిక 36, హర్మన్ ప్రీత్ 30, రిచా గోష్ 23, సాజీవన్ సంజన 11 పరుగులతో రాణించారు.
Also read: RCB vs GT: ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. బెంగళూరు ఘన విజయం
బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తానా 48 బంతుల్లో 51 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచింది. ఆమె తప్ప, బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ ఎవరూ పరుగులు చేయలేకపోయారు. రెండవ ఇన్నింగ్స్ లో భారత బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ ప్లేయర్స్ నిలబడలేకపోయారు, రేణుక సింగ్ ఉత్తమ బౌలర్ గా నిలిచింది. ఆమె నాలుగు ఓవర్లలో కేవలం 18 పరుగులకు మూడు వికెట్లు తీసింది.
Also read: Tornadoes: అమెరికాలో విధ్వసం సృష్టిస్తున్న టోర్నడోలు.. వీడియో వైరల్..
పూజా వస్త్రాకర్, శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మ, రాధా యాదవ్ తలో వికెట్ తీశారు. ప్రస్తుతం ఈ సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది.
1ST T20I. India Women Won by 44 Run(s) https://t.co/MELhRqBh37 #BANvIND
— BCCI Women (@BCCIWomen) April 28, 2024