ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అదరగొట్టిన యువ ఆటగాళ్లు యశస్వీ జైశ్వాల్, రుత్‌రాజ్ గైక్వాడ్ లకు సెలక్టర్లు తొలిసారి భారత టెస్టు జట్టులో చోటు కల్పించారు. అయితే గత కొంత కాలంగా దేశీవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్ ఖాన్‌కు మాత్రం మరోసారి సెలక్టర్లు మొండిచేయి చూపించారు.
బీసీసీఐ షార్ట్ లిస్టు చేసిన వేదికల జాబితాలో హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం ఒక్కటి.. అయితే ఉప్పల్‌లో మాత్రం భారత జట్టు ఆడే సూచనలు కన్పించడం లేదు. భారత జట్టు ఆడే మ్యాచ్‌లకు సంబంధించి బీసీసీఐ సిద్దం చేసిన డ్రాప్ట్ షెడ్యూల్‌లో ఉప్పల్ స్టేడియం పేరు లేనట్లు కనిపిస్తుంది.
జూన్ లో న్యూజిలాండ్‌తో జరిగే వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్స్ అనంతరం భారత జట్టు అక్కడే ఉండి ఆగస్టులో ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. దాదాపు నెలరోజుల పాటు భారత ఆటగాళ్లు ఖాళీగా ఉండనున్నారు. అయితే ఈ గ్యాప్‌లో బీసీసీఐ మరో టూర్‌ను ప్లాన్ చేసింది. గతంలో కరోనా కారణంగా వాయిదా పడిన శ్రీలంక పర్యటనను తెరమీదకు తీసుకొచ్చింది. ఈ పర్యటనలో భారత్.. ఆతిథ్య శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. కోహ్లీ…