IT Employees: వచ్చే మూడేళ్లలో ఏకంగా 22 లక్షల మంది ఐటీ ప్రొఫెషనల్స్ జాబులు వదులుకోనున్నారని ఓ రిపోర్ట్ వెల్లడించింది. దీన్నిబట్టి మన దేశంలోని ఐటీ-బీపీఎం రంగంలో ఉద్యోగ క్షీణత ఏ రేంజులో ఉండనుందో అర్థంచేసుకోవచ్చు. దీంతోపాటు.. 57 శాతం మంది ఐటీ నిపుణులు మళ్లీ ఈ సర్వీసుల సెక్టారులోకి రావాలనుకోవట్లేదని కూడా ఆ నివేదిక పేర్కొంది. ‘ట్యాలెంట్ ఎక్సోడస్ రిపోర్ట్’ పేరుతో ఈ నివేదికను ‘‘టీమ్ లీజ్ డిజిటల్’’ అనే సంస్థ రూపొందించింది.