2024 టి20 వరల్డ్ కప్ లో భాగంగా శనివారం నాడు ఆంటిగ్వాలో జరిగిన సూపర్ 8 మ్యాచ్ లలో భాగంగా భారత్, బంగ్లాదేశ్ లు తలబడ్డాయి. ఈ మ్యాచ్లో టీమిండియా 50 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ను ఓడించింది. దీంతో టి20 ప్రపంచ కప్ లో ప్రస్తుతం టీమిండియా అజేయంగా నిలిచింది. ఈ విజయంతో ఇండియా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లతో కూడిన గ్రూపు 1 పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానానికి చేరుకుంది.
Kalki 2898 AD : కల్కి రిలీజ్ ట్రైలర్ అదిరింది.. కానీ అదొక్కటే మైనస్..?
ఒకవేళ ఆదివారం నాడు జరిగే ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ ను ఓడిస్తే టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు సెమీఫైనల్ స్థానాలను పదిలం చేసుకుంటాయి. ఇక సూపర్ ఎయిట్ మ్యాచ్లలో టీమిండియా సోమవారం నాడు సెయింట్ లూసియాలో ఆస్ట్రేలియాతో చివరి మ్యాచ్ ఆడనుంది. ఇక మంగళవారం నాడు జరిగే చివరి సూపర్ 8 మ్యాచ్లలో బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ తలపడనున్నాయి. మ్యాచ్ అనంతరం స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. పాండ్య అటు బంతి.. ఇటు బ్యాట్ తోనూ టీమిండియాకు ఎంతో కీలకమని తెలిపాడు. పాండ్య హాఫ్ సెంచరీ అసాధారణ ప్రదర్శనతోనే బంగ్లాదేశ్ పై విజయం సాధించామని తెలిపాడు.
Mallu Bhatti Vikramarka: మూసీ నది ప్రక్షాళనకు నిధులివ్వండి.. కేంద్ర ఆర్థిక మంత్రికి భట్టి విజ్ఞప్తి
ఈ మ్యాచ్ లో మొదటగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా (27 బంతుల్లో 50 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీ చేయగా.., శివమ్ దూబే (24 బంతుల్లో 34 పరుగులు), విరాట్ కోహ్లీ (28 బంతుల్లో 37 పరుగులు), రిషభ్ పంత్ (24 బంతుల్లో 36 పరుగులు) మెరుపులు మెరిపించారు. దింతో టీంఇండియా భారీ లక్షాన్ని బంగ్లాదేశ్ కు ఇవ్వగలిగింది. ఇక అనంతరం లక్ష్యచేధనకు వచ్చిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 146 పరుగులే చేసి ఓటమిపాలైంది.