స్కూల్ విద్యార్థినితో ఓ కీచక టీచర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. పరీక్షిత్ గఢ్ లో ఒక అసిస్టెంట్ టీచర్ 7వ తరగతి విద్యార్థినిని ఓయో రూమ్ కు రావాలని బెదిరించాడు. దీంతో ఆ విద్యార్థిని ఆ టీచర్ పై కుటుంబ సభ్యులకు తెలిపింది. అనంతరం వారు టీచర్ పై పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఆ కీచక టీచర్ అనురాగ్ పై పోలీసులు పోక్సో చట్టం, బెదిరింపుల కింద పోలీసులు కేసు…
విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన గురువు నీచంగా ప్రవర్తించాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలో సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన లెక్కల టీచర్ విద్యాసాగర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి ఉత్తమ మార్గంలో నడిపించాల్సిన ఓ ఉపాధ్యాయుడు దారి తప్పాడు. తండ్రి స్థానంలో ఉండి విద్యార్థులను అభివృద్ధి పథంలో నడిపించాల్సిన గురువు.. కళ్లు మూసుకుపోయి కన్న బిడ్డ లాంటి విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించాడు.
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారి భవిష్యత్‌ను తీర్చిదిద్దాల్సిన గురువే బుద్ధితక్కువ పనులు చేస్తూ కీచకుడిలా మారాడు. మైనర్ విద్యార్థుల అసభ్యకరమైన వీడియోలను క్యాప్చర్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నందుకు నవాడాకు చెందిన మదర్సా ఉపాధ్యాయుడిని బీహార్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
తెలంగాణలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు జీవో 317ను రద్దు చేయాలని కోరుతూ నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. తాజాగా ప్రగతి భవన్‌ను ముట్టడికి టీచర్స్ యత్నించారు. దీంతో ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటి వరకు 70 మందికి పైగా టీచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాగుట్ట నుంచి ప్రగతి భవన్ వరకు పోలీసులు మోహరించారు. వచ్చిన వారిని వచ్చినట్లు అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలిస్తున్నారు. అసంబద్దంగా ఉద్యోగుల బదిలీలు చేపట్టారని, సీనియార్టీ ప్రకారం…