అడవులు అంతరించిపోతుండడంతో వన్య మృగాలు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. జనావాసాల్లో తిరుగుతూ మనుషులపై దాడి చేస్తూ ప్రాణాలు తీస్తున్నాయి. పశువులను పీక్కుతింటున్నాయి. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో వ్యవసాయ పనుల కోసం వెళ్లిన వ్యక్తిపై పులి దాడి చేసి ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. జనావాసాల్లో పులుల సంచారంతో జనం ప్రాణ భయంతో వణికిపోతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లో పులి ఓ మహిళపై దాడి చేసి చంపేసింది. కాఫీ తోటలో పనిచేస్తున్న రాధా అనే…