Srinivasa Varma: ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ తీవ్ర విమర్శలు గుప్పించారు. తణుకు మున్సిపాలిటీలో ఆయన నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు అంటూ కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే పార్టీ కార్యకర్తలు చప్పట్లు కొడతారని భావించి దూకుడుగా ప్రవర్తించడమంటూ.. నరికేస్తాం, చంపేస్తాం.. అని మాట్లాడితే ఆ నాలుకనే కోస్తామని హెచ్చరించారు. టిడిఆర్ బాండ్ల విషయమై కారుమూరి…
ఏపీలో టీడీఆర్ బాండ్ల స్కాం సీఎం చంద్రబాబు దృష్టికి వచ్చింది. తణుకులో టీడీఆర్ స్కాంపై ఏసీబీ ఇచ్చిన నివేదికను సీఎం చంద్రబాబు దృష్టికి మంత్రి నారాయణ తీసుకెళ్లారు. తణుకు టీడీఆర్ బాండ్ల స్కాం జరిగిన తీరును ముఖ్యమంత్రికి వివరించారు. టీడీఆర్ స్కాంపై మరింత లోతుగా విచారణ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.