శ్రీకాకుళం జిల్లాలోని కోవిడ్ కేర్ ఆసుపత్రిని పరిశీలించేందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పిలుపునిచ్చారు. దీంతో టీడిపీ కార్యకర్తలు పాత్రుని వలసలోని కోవిడ్ కేర్ ఆసుపత్రుకి చేరుకున్నారు. ప్రస్తుతం కర్ఫ్యూ, 144 సెక్షన్ అమలులో ఉండటంతో పోలీసులు అనుమతించలేదు. పాత్రుని వలస వెళ్లకుండా టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. కూన రవికూమార్ బయటకు వెళ్లడానికి వీలులేదని, పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో కూన రవికుమర్ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. తమ హక్కులను కాలరాస్తున్నారని పోలీసులపై కూన రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.