టిడిపి అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్ వేశారు. కరోనా వైరస్ లాగానే చంద్రబాబు.. రోజుకో వేరియంట్ గా మారుతున్నాడని ఎద్దేవా చేశారు. “కరోనా వైరస్ లాగానే చంద్రబాబు రోజుకో తీరు మారుతున్నాడు. ప్రజలను ఇబ్బంది పెట్టడానికి చంద్రబాబు కొత్త వేరియంట్ లా మారుతున్నాడు. బాబూ, నీది మీటర్ గేజ్ పై తిరిగే రైలు. ఈ రెండేళ్లలో రాష్ట్రమంతా గేజి మార్పిడి జరిగి బ్రాడ్ గేజ్ అందుబాటులోకి వచ్చింది. అయినా ఈ పట్టాల మీదే…
రెండేల్ల పాలనలో సీఎం వైఎస్ జగన్ 94 శాతం హామీలు నెరవేర్చారు. అన్ని రంగాల్లో మహిళలకు సీఎం జగన్ ప్రాధాన్యత కల్పించారు అని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. మంత్రి వర్గంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యం కల్పించిన ఘనత సీఎం జగన్ దే. నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు మహిళలకు సీఎం కల్పించారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం ద్వారా ఆడపిల్లల డ్రాపవుట్లు తగ్గించిన ఘనత సీఎందే అని తెలిపారు. విద్యార్థినులు చక్కగా చదువుకునేందుకు…
ఎన్నికల్లో వైఎస్ జగన్ ఇచ్చిన మేనిఫెస్టో లో ప్రతి అంశాన్ని నెరవేర్చేలా చర్యలు తీసుకున్నారు. మేనిఫెస్టో లో ఇచ్చి హామీల్లో నూటికి 94శాతం హామీలు సీఎం నెరవేర్చారు అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రతి లబ్దిదారుడికి నేరుగా వారి బ్యాంకు ఖాతాలో నగదు బదిలీ చేశారు. 2ఏళ్ల పాలనపై సీఎం విడుదల చేసిన పుస్తకాన్ని ప్రతి లబ్ది దారుడికి పంపిస్తాం. సంక్షేమం అభివృద్దిని రెండు కళ్లుగా ప్రభుత్వం భావిస్తోంది. వైఎస్…
టిడిపి అధినేత చంద్రబాబుపై మరోసారి వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు పిల్లి శాపాలకు ఎవరు భయపడబోరని చరకలు అంటించారు విజయసాయిరెడ్డి. వచ్చే మహానాడు వరకు టిడిపి పార్టీ ఉంటుందో లేదో చూసుకోవాలని చంద్రబాబు సూచనలు చేశారు. “పిల్లి శాపాలకు ఉట్లు తెగవు బాబూ. 2024 ఎన్నికల గురించి ఇప్పుడే జోస్యాలు చెబ్తున్నావు. వచ్చే మహానాడు వరకు నీ పార్టీ ఉంటుందో లేదో చూసుకో. మూడేళ్ల తర్వాత జగన్ గారి వెంట ఎవరూ మిగలరని శోకాలు…
టీడీపీ పార్టీ నుంచి జూమ్ పార్టీ గా మారింది. చంద్ర బాబు నాయుడు జూమ్ పార్టీ అధ్యక్షులు అని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. కరోనా వచ్చిన జగన్ అని ప్రాజక్ట్ లు పూర్తి చేయడానికి పని చేస్తున్నారు. కరోనా వచ్చాక మీరు ఇంట్లో నుంచి బయటకు రాకుండా కేవలం జూమ్ ల ద్వారా విమర్శలు చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో కూడా ప్రభుత్వం ఒక సంక్షేమ పథకాన్ని కూడా అవ్వలేదు. ప్రతి పక్ష నాయుకుడిగా ప్రజల కోసం…
మైదుకూరు నియోజకవర్గంలో పోలీసుల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అని టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. పోలీసులు వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు…రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదు. నియెజకవర్గంలోని టీడీపీ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారు అని తెలిపారు. మొన్న జరిగిన మునిసిపల్ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిని అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులపై చట్ట పరమైన చర్యలకు వెళ్తున్నాం అని తెలిపిన ఆయన డిఎస్పీ, సిఐ, ఎస్సైల అక్రమాలపై కోర్టులో కేసులు వేశాం అని…
టిడిపి అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్ వేశారు. చంద్రబాబుకు వయసు, టైమ్ అయిపోయిందని.. అందుకే జూమ్ లో కాలక్షేపం చేస్తున్నాడని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. “గడియారం ముల్లుపై ఆశలు పెట్టుకుని జూమ్ లో కాలక్షేపం చేస్తుండు. శాశ్వతంగా అక్కడే మిగిలిపోతావు. కాలం పరుగులు పెడుతూనే ఉంటుంది. దానితో పోటీపడి పని చేస్తుంటాడు యువ సిఎం. నీకు వయసు మీద పడింది. టైమ్ అయిపోయింది. ముల్లు వెనక్కి తిరగదు.” అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇక…
టిడిపి నిర్వహిస్తున్న మహానాడుపై మరోసారి వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు. మహానాడు పేరు తీసేసి “నారా నేడు” లేదా “పప్పు డప్పు” అని పెట్టుకో సరిపోతుందని ఎద్దేవా చేశారు. “వైఎస్సార్ పంటల బీమా పథకంపై పడి ఏడుస్తాడు. రైతు భరోసా కింద డబ్బులిస్తే కేంద్ర నిధులంటాడు. కేంద్ర నిధులైతే అన్ని రాష్ట్రాల్లో ఉండాలిగా చంద్రబాబూ? మహానాడులో అబద్ధాలు ప్రచారం చెయ్యడానికి సిగ్గులేదూ ? మహానాడు పేరు తీసేసి “నారా నేడు” లేదా “పప్పు డప్పు” అని…
విశాఖ బీచ్ రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడుపల్లా శ్రీనివాస్, tnsf రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. సీని రంగం ద్వారా ఎన్టీఆర్ తెలుగు జాతికి మంచి పేరు తెచ్చారని..రాజకీయాలలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో చైతన్యం తెచ్చారని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలకు అవకాశం ఇచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అని…