సిఎం జగన్ ఢిల్లీ టూర్ నేపథ్యంలో ఏపీ రాజకీయాలు మళ్ళీ వేడెక్కాయి. కేసుల నుంచి తప్పించుకునేందుకే సిఎం జగన్ జగన్ ఢిల్లీ వెళుతున్నారని టిడిపి విమర్శలు చేసింది. అయితే టిడిపికి తాజాగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ అమోల్ బేబీ అయితే… లోకేష్ హెరిటేజ్ దున్నపోతా? భాష మాకు కూడా వచ్చు అని హెచ్చరించారు మంత్రి అనిల్ కుమార్. నాయకత్వ లక్షణాలు రక్తంలో ఉంటాయి…నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడం కాదన్నారు. దేశ ప్రజలు…
ఏపీ సీఎం వైఎస్ జగన్ హస్తినకు వెళ్లారు.. మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న ఆయన.. పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు.. ఇక, రాత్రికి అక్కడే బస చేసే.. రేపు తిరిగి ఏపీకి రానున్నారు.. ఇదే సమయంలో.. సీఎం ఢిల్లీ పర్యటనపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.. ఆ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ.. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి ప్రతిపక్షాలకు అత్యుత్సాహం ఎక్కువ అవుతోందని మండిపడ్డ ఆయన.. సీఎం టూర్ పై వక్రభాష్యాలు చెప్పడం దురదృష్టకరం అన్నారు..…
ఏపీ సర్కార్ పై టిడిపి నేత నారా లోకేష్ మరోసారి ఫైర్ అయ్యారు. అధికారం అండతో వైసీపీ పార్టీ హత్యారాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మలకాపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త గోపాల్ ను వైసీపీ నేతలు పాశవికంగా హత్య చేశారని లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. టిడిపి ప్రభుత్వం హయాంలో రాష్ట్రమంతా అభివృద్ధి-సంక్షేమం కనిపించేదని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. వైసీపీ రెండేళ్ల పాలనలో హత్యలు, దోపిడీలు, అరాచకాలే కనిపిస్తోన్నాయని…
టిడిపి, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు దోచుకోవడం తప్ప వేరే ఎజెండానే లేదని..అందుకే ప్రజలు ఈడ్చి కొట్టారని చురకలు అంటించారు. చంద్రబాబు ఇంకో ఐదేళ్లు అధికారంలో ఉంటే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అయ్యేదన్నారు. “ప్రజలు ఈడ్చి కొట్టారు కాబట్టి సరిపోయింది. బాబు ఇంకో ఐదేళ్లు అధికారంలో ఉంటే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అయ్యేది. ఇసుక మాఫియా, మైనింగ్, నీరు-చెట్టు నిధుల్ని బొక్కే మాఫియా, హెరిటేజ్…
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో మహిళలకు గౌరవం లేదు, రక్షణలేదు, సంక్షేమ పథకాలు కూడా లేవని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా… వైఎస్ జగన్ రెండేళ్ల పాలనపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆమె… వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే మహిళలకు భద్రత కల్పించారు, రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చారు.. కానీ, చంద్రబాబు వ్యాఖ్యలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.. ఆయనకు చిన్నమెదడు చితికిపోయిందా..? అని ప్రజలు అనుకుంటున్నారని సెటైర్లు వేశారు.. మరోవైపు.. ప్రతీ అంశంలో…
టిడిపి అధినేత చంద్రబాబు, నారా లోకేష్ పై వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ అనే పొట్టేలును ఏపుగా మేపి రాష్ట్రం మీదకు చంద్రబాబు వదిలాడని చురకలు అంటించారు. ప్రజలు..చూసి, చూసి ఏదో ఒక రోజు ఆ పొట్టేలు కొమ్ములు వంచుతారని ఎద్దేవా చేశారు. “లోకేశ్ అనే పొట్టేలుని ఏపుగా మేపి రాష్ట్రం మీదకు వదిలాడు బాబు. కొమ్ముల దురదతో దారిన పోయే వారందరిని కుమ్మాలని చూస్తున్నాడు. చూసి చూసి ఎన్నడో కొమ్ములు…
కాకని గోవర్ధన్ రెడ్డిపై టిడిపి నేత సోమిరెడ్డి ఫైర్ అయ్యారు. కాకని గోవర్ధన్ రెడ్డి చెప్తున్న మాటలు అన్ని అవాస్తవమని.. ఆనందయ్య పర్మిషన్ లేకుండా ఆన్లైన్ లో మందు పంపిణీ పెట్టారు..అది ప్రశ్నిస్తే తప్ప ? అని నిలదీశారు. గోవర్ధన్ రెడ్డి బాష..దారుణంగా ఉందని..హద్దులేకుండా మాట్లాడటం సబబు కాదని చురకలు అంటించారు. రాజకీయంగా అనవసరంగా మందు పంపిణీ ఆపారని..ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పినా మందు పంపిణీ ఆపారని మండిపడ్డారు. తెలుగుదేశం మందు పంపిణీకి పూర్తి మద్దతు ఇస్తుందని..మా కుటుంబాలను…
పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలపై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఎట్టకేలకు స్పందించారు. జూన్ 1న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఫోన్ చేసి సీఎం కేసీఆర్ మిమ్మల్ని గుర్తు చేసారని చెప్పారని ఎల్ రమణ పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కలిసి…రాజకీయ భవిష్యత్ గురించి ఏం ఆలోచన చేస్తున్నారని అడిగారని కూడా ఆయన తెలిపారు. గతంలో కూడా టిఆర్ఎస్ నుంచి ఆఫర్ వచ్చింది…ఇది కొత్త ఏం కాదని వెల్లడించారు. పార్టీ…