ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు కొన్ని ప్రాంతాల్లో చిచ్చు పెడుతున్నాయి.. జిల్లా పేరు కోసం కొందరు.. జిల్లా కేంద్రం కోసం మరొకరు.. గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఇంకొద్దరు డిమాండ్ చేస్తున్నారు.. అలాంటి జిల్లాలో ఒకటి అనంతపురం జిల్లాలో కొత్తగా ఏర్పాటు కాబోతున్న సత్యసాయి జిల్లా.. దీనిపై ర్యాలీ చేసి దీక్షకు దిగిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. హిందూపురం కేంద్రంగానే జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.. అన్ని రకాలుగా హిందూపురం అభివృద్ధి చెందింది.. జిల్లా కేంద్రంలో…
త్వరలో అండమాన్ నికోబార్‌లో జరగనున్న మునిసిపల్, పంచాయతీ ఎన్నికల కోసం టీడీపీ, కాంగ్రెస్ చేతులు కలిపాయి. ఈ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి. ఏఎన్టీసీసీ అధ్యక్షుడు రంగలాల్ హల్దార్, టీడీపీ స్థానిక అధ్యక్షుడు మాణిక్యరావు యాదవ్ బుధవారం పోర్టు బ్లెయిర్‌లో గాంధీ భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు. పొత్తులో భాగంగా పోర్టు బ్లెయిర్ మునిసిపాలిటీలోని 2, 5, 16 వార్డుల్లో టీడీపీ పోటీ…
2022-23కు గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయితే ఈ బడ్జెట్ పై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదని ఆయన అన్నారు. రైతులు, పేదల కోసం ఏం చేస్తున్నారో చెప్పలేదన్నారు. వేతన జీవులకు మొడి చేయి చూపారన్నారు. నదుల అనుసంధానంపై కేంద్ర ప్రణాళికలను స్వాగతిస్తున్నామన్నారు. డిజిటల్, సోలార్, ఎలక్ట్రికల్ వెహికిల్ రంగంలో సంస్కరణలు మంచి పరిణామం అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు సాధించడంలో మరోసారి వైసీపీ…
ప్రభుత్వ విధానాలతోనే రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని టీడీపీ ఏపీ అధ్యక్షడు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. పెడనలో చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం బాధకరమన్నారు. ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు జగన్ సర్కార్ ఉద్దరించింది ఏం లేదని మండి పడ్డారు. టీడీపీ హయాంలో చేనేతలకు ప్రోత్సాహకాలు, రాయితీలు, రుణాలు, వడ్డీ రాయితీలు చాలా ఇచ్చామన్నారు. సొంత మగ్గం లేకున్నా రిబేటుతో సహా ఏడాదికి రూ.…
ఉద్యోగుల ఉద్యమాన్ని నీరు గార్చేందుకే కొత్త జిల్లాల ప్రతిపాదనను సీఎం జగన్ తీసుకొచ్చారని టీడీపీ జాతీయ ఉపాధ్యాక్షుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. కొత్త జిల్లాల విభజన దారుణంగా ఉందన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలకు మాట్లాడే ధైర్యం లేదని మండిపడ్డారు. అభివృద్ధి పనులు చేయలేదని ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలంటూ డిమాండ్ చేశారు. కొత్త జిల్లాల విభజన ఫేక్‌గా తయారైందన్నారు. సీఎం ను ప్రసన్నం చేసుకునేందుకు…
చేసిన అప్పులు ఎలా తీర్చాలో జగన్ కు తెలుసని , సీఎంగా వైఎస్ జగన్ 30 సంవత్సరాలపాటు అధికారంలో ఉంటారని మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. సచివాలయంలో నిన్న పర్యాటక, క్రీడ, సాంస్కృతి శాఖలపై సమీక్ష నిర్వహించిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అప్పులు చేయలేదని, కరోనా సమయంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్పులు చేశాయని పేర్కొన్నారు. ఇంకా చెప్పాలంటే ఏపీ కంటే ఎక్కువగానే అప్పులు చేశాయన్నారు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో కూడా…
నేరం చేసిన వారెవ్వరిని వదిలి పెట్టబోమని హోం మంత్రి సుచరిత స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుడారు. నేరాలు జరగటం లేదని మేం చెప్పడం లేదు.. నేరం జరిగితే ప్రభుత్వం ఎంత వేగంగా స్పందిస్తుందో, నిందితులను ఏ విధంగా కఠినంగా శిక్షిస్తుందో చూడాలి. పార్టీ ఏదైనా.. మహిళలపై చేయి వేస్తే ఉపేక్షించే ప్రభుత్వం మాది కాదని సుచరిత అన్నారు. గుంటూరు బాలిక వ్యభిచారం కేసులో 46మందిని అరెస్టు చేశామని సుచరిత అన్నారు. విజవాడలో…
నారీ సంకల్ప దీక్ష చేసే అర్హత టీడీపీకి లేదని వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… టీడీపీ పై తీవ్ర విమర్శలు చేశారు. అది నారీ సంకల్ప దీక్ష కాదు. దుస్సంకల్ప దీక్ష అని ఎద్దేవా చేశారు. లోకేష్ పీఏ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నా రని దాన్ని చంద్రబాబు పక్కదోవ పట్టిస్తున్నారని అన్నారు. లోకేష్ స్విమ్మింగ్ పూల్ ఫోటోలు చూస్తే వారికి మహిళల పట్ల ఏమాత్రం గౌరవం ఉందో అర్థం…
ఫిస్కల్ కౌన్సిల్ అవసరం లేదని ఆర్థిక మంత్రి బుగ్గన చెప్పడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్ కేటాయింపులన్నీ దుబారా చేశారని, పట్టపగలే ప్రజాధనాన్ని నిలువుదోపిడీ చేశారని వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. అందుకే ఫిస్కల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు. ఆర్ధిక నిపుణులు పేర్కొన్నట్లుగా ఫిస్కల్ కౌన్సిల్ ఏర్పాటు ఏపీలో తక్షణావశ్యకం ఉందన్నారు. రాష్ట్రంలో గతితప్పిన ఆర్ధిక పరిస్థితిని…
విజయవాడలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలిక ఆత్మహత్య చేసుకోవడం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కలకలకం రేపిన సంగతి తెల్సిందే. ఆమె ఆత్మహత్య విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగు దేశం పార్టీ నేత వినోద్ జైన్ ను ఆ పార్టీ ఇప్పటికే సస్పెండ్ చేసింది. మరో పక్క తెలుగు దేశం పార్టీ నేతలపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.ఈ నేపథ్యంలో బాలిక ఆత్మహత్య ఘటన పై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి కూడా తన…