అజెండా నుంచి ప్రత్యేక హోదా అంశం తొలగింపు టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రేనని ఆరోపించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర హోంశాఖ నేతృత్వంలో జరిగే సమావేశం అజెండా నుంచి ప్రత్యేక హోదా తొలగింపు చంద్రబాబు కుట్రే అన్నారు.. బీజేపీలోని టీడీపీ నేతల ద్వారా ఈ పని చేయించారని విమర్శించారు.. ఇక, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు పెద్దిరెడ్డి… ప్రత్యేక హోదా కోసం మా పోరాటం కొనసాగుతుందని ప్రకటించిన ఆయన.. చంద్రబాబుకు హోదా పై మాట్లాడే అర్హతే లేదన్నారు.. ప్యాకేజీ కోసం టీడీపీ అమ్ముడుపోయింది అంటూ మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
Read Also: Ram Mohan Naidu: స్టేటస్ హామీతో గెలిచారు.. రాజీనామా చేయండి.. మేం రెడీ..!