నెల్లూరు జిల్లాలోని కందుకూరులో నిన్న నిర్వహించిన ‘ఇదేం కర్మ రాష్ట్రానికి’ సభలో తొక్కిసలాట చోటు చేసుకోవడంతో ఎనిమిమంది ప్రాణాలు కోల్పోయారు. అయితే దీనిపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ స్పందించారు.
టీడీపీలో కొత్త చర్చ జరుగుతోంది. పార్టీలో కుమ్మక్కు రాజకీయం జరుగుతోందా..? అనేదే టీడీపీ సర్కిల్సులో తాజా హాట్ టాపిక్. చాలా కాలంగా టీడీపీ అధినాయకత్వం స్థానికంగా ఉన్న సమస్యలపై పోరాడండి.. స్థానిక ఎమ్మెల్యేలు చేసే అవినీతి అక్రమాలు తదితర అంశాలపై ఫోకస్ పెట్టండని ఆదేశిస్తోంది. కానీ ఈ మాటను మెజారిటీ ఇన్ఛార్జులెవ్వరూ లక్ష్య పెట్టడం లేదట. ఏదో మొక్కుబడిగా పార్టీ కార్యాలయానికి రావడం ఓ ఫొటో దిగడం.. వాటిని పార్టీ కార్యాలయానికి పంపుకొంటూ చేతులు దులిపేసుకుంటున్నారట. దీంతో…
ఆంధ్రప్రదేశ్‌లో అప్పుల విషయంపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.. ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు.. ఇలా దుమ్మెత్తిపోసుకుంటున్నారు.. తాజాగా, రాష్ట్రంలో అర్థిక ఇబ్బందులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.. అసలు, టీడీపీ చేసిన తప్పులు, అప్పుల వల్లే నేటికీ ఆంధ్రప్రదేశ్‌కు తిప్పలు అని పేర్కొన్నారు.. యనమలది కునుకు పాటా?’ఉనికి పాట్లా? అంటూ మాజీ ఆర్థికశాఖ మంత్రి, టీడీపీ సీనియర్ నేత…
విపక్షాల అఖిలపక్ష సమావేశంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి పేర్నినాని.. సీఎం వైఎస్ జగన్‌పై నిజంగా ప్రజల్లో వ్యతిరేకత ఉంటే ఎందుకు మీ అందరికీ భయం? కలిసి ఎందుకు పోరాటం చేయాలనుకుంటున్నారు? అంటూ నిలదీశారు.. చంద్రబాబు ఏ డ్యాన్స్ వేయమంటే ఆ డ్యాన్స్ వేస్తారు సీపీఐ రామకృష్ణ.. ఎక్కడ చిందు వేయమంటే అక్కడ వేస్తారు.. నారాయణ, రామకృష్ణ, వంటి కుహనా మేధావులు అందరూ చంద్రబాబు పక్కన చేరారని ఫైర్ అయ్యారు. సోనియా గాంధీతో కుమ్మక్కై మీరందరూ ఎన్ని…
Minister Kottu Satyanarayana: తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేతపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ.. తాజా పరిణామాలపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. టీడీపీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని వ్యాఖ్యానించారు. ఇక, ఉనికి కోసమే టీడీపీ ఆరాటం.. తమ పార్టీ బతికే ఉందని చెప్పుకునే ప్రయత్నం చేస్తుందని ఎద్దేవా చేశారు.. పార్టీ అధ్యక్షుడే పార్టీ లేదూ బొక్కా లేదూ అనటం అంటే ఆ పార్టీ లేనట్లే కదా..? అని సెటైర్లు వేశారు. ప్రజాస్వామ్యం…
అఖిలపక్ష సమావేశం ముగిసింది.. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటూ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.. వివిధ తీర్మానాలు చేసింది అఖిలపక్ష సమావేశం. జగన్ ప్రభుత్వ హింసాత్మక చర్యలపై సీజేఐను కలిసి వినతిపత్రం ఇవ్వాలని, రాష్ట్రస్థాయిలో ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఏర్పాటు చేయాలని, జిల్లా, మండల స్థాయిలో పరిరక్షణ వేదిక కమిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని.. ప్రభుత్వ అణిచివేతకు గురైన వారికి వేదిక అండగా ఉండాలని, ప్రభుత్వ విధానాలపై పరిరక్ష వేదిక పనిచేయాలని తీర్మానించారు. ఇక, వైఎస్ జగన్ హయాంలో…
తుని నియోజకవర్గం ఒకప్పుడు టిడిపికి కంచుకోట. ఈ నియోజకవర్గంలో 2009లో తొలిసారి యనమల రామకృష్ణుడు ఓడిన తర్వాత పరిస్థితి మారిపోయింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో యనమల తమ్ముడు కృష్ణుడు బరిలో ఉన్నప్పటికీ టీడీపీకి ఓటమి తప్పలేదు. ఇప్పుడు యనమల దృష్టంతా వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఉంది. గత వారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో నర్మగర్భంగా తన మనసులో మాట చెప్పేసారు యనమల. యువతకు 40 శాతం సీట్లు కేటాయిస్తేనే గెలుస్తామని టీడీపీ అధినేతకు చెప్పానన్నారు. ఎప్పుడూ…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విశాఖ వేదికగా జరుగుతోన్న కాపునాడు సభ చర్చగా మారింది.. అయితే, కాపునాడు సభకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు.. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కూడా దూరంగా ఉన్నాయి.. జనసేన పార్టీ నేతలు మాత్రం హాజరుకాబోతున్నారు. దీంతో, ఈ సభలో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయన్నదానిపై ఆసక్తి నెలకొంది.. వంగవీటి మోహనరంగ పోరాటం స్ఫూర్తిగా కార్యాచరణ ప్రకటించబోతున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కాపు ప్రతినిధులు ఈ సభకు తరలివస్తున్నారు.. రాజకీయాలకు అతీతమే అని చెప్పినప్పటికీ..…