Vasantha Krishna: గుంటూరు వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్న ఈ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.. కందుకూరు ఘటనలో ఎనిమిది మంది మృతిచెందిన కొద్ది రోజులకే ఈ ఘటన జరగడంతో విమర్శల దాడి పెరిగింది.. అయితే, గుంటూరులో ఆ కార్యక్రమం నిర్వహించిన ఉయ్యూరు శ్రీనివాస్‌కు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే నుంచి అనూహ్యంగా మద్దతు లభించింది.. ఉయ్యూరు శ్రీనివాస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. గుంటూరు ఘటనలో ఆయన తప్పేమీ లేదన్న కృష్ణప్రసాద్.. ప్రజలకు సేవ చేస్తున్న ఎన్నారైలను భయపెడితే ఎలా అంటూ ప్రశ్నించారు. ఇక, గుంటూరు ఘటనను చిలువలు, ప లువలు చేసి మాట్లాడడం సరికాదని హితవుపలికారు.. ఉయ్యూరు శ్రీనివాస్ నాకు మంచి మిత్రుడు.. ప్రవాసాంధ్రుల వల్ల దేశానికి మంచి జరుగుతుంది.. శ్రీనివాస్ పేదల పట్ల అభిమానం ఉన్న వ్యక్తి.. ప్రజలకు నష్టం కలిగించాలని ఉయ్యూరు శ్రీనివాస్ ఇలాంటి కార్యక్రమాలు చేయరని స్పష్టం చేశారు వసంత కృష్ణప్రసాద్..
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
ఇక, తెలుగుదేశం పార్టీతో కలిసి కార్యక్రమం చేశారు కాబట్టి శ్రీనివాస్‌పై వివాదాలు వస్తున్నాయన్నారు కృష్ణప్రసాద్.. లేనిపోని ఆరోపణలు చేస్తూ పోతో.. భవిష్యత్‌లో ఎన్నారైలో రాష్ట్రంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుకు రారని హితవుపలికారు..సేవను రాజకీయ కారణాలతో విమర్శించడం మంచి పద్ధతి కాదు. కొంత మంది వ్యక్తులు ఎన్నారైలను వారి పనులు వారు చూసుకోవాలని సలహా ఇస్తున్నారు. ఎన్నారైలను భయపెడితే ఎలా అంటూ హాట్ కామెంట్లు చేశారు. ఎన్నారైలతో దేశంలో చాలా అభివృద్ధి జరుగుతోందని వివరించారు. ప్రవాసుల సాయాన్ని ఆపాలనుకోవటం అవివేకమవుతోందని హెచ్చరించారు.. ఇక, ఉయ్యూరు శ్రీనివాస్‌పై వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చేసిన వ్యాఖ్యల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..