నెల్లూరు జిల్లాలోని కందుకూరులో జరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సభలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 8 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరిచిపోకముందే తాజాగా అదే చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట జరిగింది.
బెజవాడ రాజకీయాలు…వంగవీటి రంగా చుట్టూ తిరుగుతున్నాయ్. ఆ ఘటన జరిగి మూడు దశాబ్దాలు గడిచినా…దాన్ని రాజకీయంగా వాడుకునేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయ్. అవసరాన్ని బట్టి రంగా అంశాన్ని బయటికి తీసి…ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయ్. ఇటీవల రంగా హత్యోదంతంపై ప్రత్యర్థులు…దేవినేని నెహ్రూను టార్గెట్ చేశారు. దీనిపై ఆయన తనయుడు దేవినేని అవినాష్…తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ వ్యవహారంలో దేవినేని కుటుంబాన్ని విలన్లుగా చూపుతూ రాసే కథనాలు.. చేసే కామెంట్లకు ఫుల్ స్టాప్ పెట్టాలనేది ఈ హెచ్చరికల ముఖ్య ఉద్దేశ్యం అంటున్నారు.…
పార్టీ కోసం పని చేసేవారిని నా ప్రాణాలు అడ్డుపెట్టి అయినా కాపాడుకుంటానని ప్రకటించారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. కందుకూరు బహిరంగ సభలో జరిగిన దురదృష్టకరమైన ఘటనపై స్పందిస్తూ.. కందుకూరు సభకు వేలాది మంది ప్రజలు వచ్చారు.. కానీ, మాజీ ముఖ్యమంత్రిగా నేను వచ్చినా పోలీసులు రక్షణ కల్పించలేదు.. పోలీసులు ఎక్కడా జాగ్రత్తలు తీసుకోలేదు.. అందుకే ఇలాంటి ఘటన చోటు చేసుకుందని మండిపడ్డారు.. కందుకూరులో నేను సభ పెట్టిన…
నారా లోకేష్ పాదయాత్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం ఎన్ఆర్ పురం గ్రామంలో గడపగడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయ పరిజ్ఞానం లేని లోకేష్ నీకెందుకు ఈ పాదయాత్ర..? అని ప్రశ్నించారు.. ఎవరిని ఉద్ధరించడానికి చేస్తావ్ ఈ పాదయాత్ర..? అని నిలదీసిన ఆయన.. వార్డ్ మెంబర్గా కూడా గెలవలేని నువ్వు ముఖ్యమంత్రి అయిపోవాలని పగటి కలలు కంటున్నావు అంటూ…
Bhuma Akhila Priya: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ.. నంద్యాలలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఏపీలో బతకడం కన్నా పక్క రాష్ట్రాల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బతకోచ్చు అనే స్థాయికి ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆరోపణలు గుప్పించారు.. వైసీపీ నాయకులు ఎన్నో హామీలు ఇచ్చి మభ్యపెట్టి, అధికారంలోకి వచ్చారు.. తీరా, అధికారం వచ్చిన తర్వాత ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. ఉద్యోగాలు ఇస్తామని హామీలు ఇచ్చిన వైఎస్…
మూడు రాజధానుల వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో కాక రేపుతూనే ఉంది.. మూడు రాజధానుల ఏర్పాటు వైపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుండగా.. విపక్షాలు మాత్రం.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాయి.. అయితే, ఈ నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు పేరుతో నిర్వహిస్తోన్న కార్యక్రమాలపై మండిపడ్డారు.. జన్మభూమి కార్యకర్తలు…