High Tension In Kuppam: కుప్పంలో టెన్షన్ టెన్షన్.. బాబు టూర్ ముందుకు సాగేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Tension In Kuppam: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పర్యటనకు సిద్ధం అయ్యారు చంద్రబాబు.. అయితే, ఆయన పర్యటనకు అడుగడునా ఆంక్షలు విధిస్తున్నారు పోలీసులు.. శాంతిపురం మండలంలో వందల మంది పోలీసుల మోహరించారు.. దీంతో, శాంతిపురం మండలం గడ్డురు క్రాస్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. టీడీపీ వాహన డ్రైవర్లపై పోలీసులు చేయి చేసుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.. పార్టీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు పోలీసులు. టీడీపీ ప్రచార రథం, సౌండ్ వాహనం పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు.. డ్రైవర్లు, సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.. పర్యటనలో సౌండ్ సిస్టమ్ కోసం అనుమతి కోరుతూ ఇప్పటికే టీడీపీ నేతలు పోలీసులకు లేఖలు కూడా ఇచ్చామని చెబుతున్నారు..
Read Also: Towel Inside Stomach: షాకింగ్ ఘటన.. మహిళ కడుపులో టవల్‌ను వదిలేసి కుట్లేశారు..!
Also Read
- AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
- Polavaram Hydel Project: పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలక ముందడుగు..
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
మరోవైపు.. కెనామాకులపల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన స్టేజిని సైతం తొలగించారు పోలీసులు.. చంద్రబాబు పర్యటించే తొలి గ్రామంతో సహా మండలంలో అన్ని చోట్ల భారీగా పోలీసులు మోహరించారు.. ప్రతి గ్రామంలో, కూడళ్లలో పదుల సంఖ్యలో పోలీసు వాహనాలు, అదనపు బలగాలను దింపారు.. కాసేపట్లో బెంగుళూరు నుంచి 121- పెద్దూరు గ్రామం చేరుకోనున్నారు చంద్రబాబు నాయుడు. షెడ్యూల్ ప్రకారం ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు చంద్రబాబు.. అయితే, రోడ్లపై సభలు, ర్యాలీలను నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో.. ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ కొనసాగుతోంది.. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. జాతీయ, రాష్ట్ర, పంచాయతీ రాజ్, మున్సిపల్ రోడ్లపై సభలు, రోడ్‌షోలు, ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తీసుకోనున్నారు.. అయితే, రోడ్లకు దూరంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే ప్రదేశాలు ఎంపిక చేయాలని ఆదేశాల్లో పేర్కొంది సర్కార్.. ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే సభలకు షరతులతో కూడిన అనుమతి ఇవ్వాలని స్పష్టం చేసింది.. ఇక, చంద్రబాబు పర్యటనలో అడుగడునా ఆంక్షలు కొనసాగుతున్నాయి.. మరి చంద్రబాబు ఎలా ముందుకు సాగుతారు? అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!