Vishnuvardhan Reddy: 2024 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లోని ఓ ముఖ్యమైన ప్రాంతీయ పార్టీ కనుమరుగవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు భారతీయ జనతా పార్టీ నేత విష్ణువర్ధన రెడ్డి.. తిరుమలలో ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. 2024లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందన్నారు.. ఇక, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తరువాత ఏపీ రాజకీయ ముఖ చిత్రం మారబోతుందని జోస్యం చెప్పారు.. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కూమార్ రెడ్డి రాకతో.. మాజీ ప్రజాప్రతినిధులందరూ బీజేపీకి టచ్లోకి వస్తున్నారని తెలిపారు.…
తోడేళ్లన్నీ ఏకమైనా నాకేమీ భయం లేదు.. దేవుని దయ.. మీ చల్లని ఆశీస్సులే కోరుకున్నా అని వ్యాఖ్యానించారు సీఎం వైఎస్ జగన్.. నౌనాడలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. మూలపేట మూలన ఉన్న పేట కాదు.. అభివృద్ధికి మూలస్తంభం కానుందంటూ అభివర్ణించారు సీఎం జగన్.. 24 మిలియన్ టన్నులు సామర్థ్యంతో నాలుగు బెర్త్ లు కేటాయిస్తున్నాం.. పోర్ట్ కోసం 2954 కోట్లు ఖర్చుచేసి 24 నెలల్లో పుర్తి చేస్తాం అన్నారు.. 14 కిలోమీటర్ల రహాదారులు , 11…
Pinnelli Ramakrishna Reddy: 2024 ఎన్నికల తరువాత చంద్రబాబు, లోకేష్ తోకలు కట్ చేస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ వివేక హత్య కేసులో సీబీఐ దర్యాప్తు మేరకు దోషులకు శిక్ష పడుతుందన్నారు.. కానీ, దీనిపై రాజకీయం చేయడం తగదన్నారు.. ఇక, నారా లోకేష్ వార్డు కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత.. 151 అసెంబ్లీ సీట్లు గెలిచిన సీఎం వైఎస్ జగన్ పై విమర్శలు చేయాలంటూ…
Minister Harish Rao: భారత దేశంలో తెలంగాణ తప్పా ఏ రాష్ట్రం కూడా ముస్లింలకు రంజాన్ పండగ కానుకలను అందించలేదని, గత ప్రభుత్వాలు ముస్లింలకు పండగ కానుకను అందించలేదని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్ధిపేటలోని కొండ భూదేవి గార్డెన్స్ లో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగ కానుకలను హరీష్ రావు పంపిణీ చేశారు. రాష్ట్రంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవుల పండగలకు సరుకులు అందిస్తున్నారమని ఆయన వెల్లడించారు.
RK Roja Open Challenge: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు మంత్రి ఆర్కే రోజా.. సీఎం వైఎస్ జగన్ స్టిక్కర్లు చూస్తే చంద్రబాబు గుండెల మీద ఎవరో ఎగిరి ఎగిరి కొట్టినట్లు ఉంటోందని సెటైర్లు వేసిన ఆమె.. చాలా మంది మేం కావాలని, రావాలని అడుగుతున్నారు.. కొంత మంది దొంగతనంగా వెళ్లి స్టిక్కర్లు పీకేస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు.. ఇక, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏం చేశారో చెప్పగలరా? అని ఛాలెంజ్ చేశారు..…
Kethireddy Venkatarami Reddy: శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.. సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయాయి.. ధర్మవరంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నా నియోజకవర్గ ప్రజల కోసం ఎంతో కృషి చేస్తున్నాను అన్నారు.. ఉదయమే నేను ప్రతీ ఇళ్లు తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటున్నాను.. మధ్యాహ్నం నా భార్య తిరుగుతుంది.. సాయంత్రం నా తమ్ముడు తిరుగుతున్నాడు.. ఇలా మా కొంపంతా మీకు చాకిరీ చేస్తున్నామంటూ…
Selfie Challenge: ఆంధ్రప్రదేశ్లో సెల్ఫీ ఛాలెంజ్ కొనసాగుతోంది.. ఇప్పటి వరకు నారా లోకేష్, చంద్రబాబు.. సీఎం వైఎస్ జగన్, వైసీపీ ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్లు విసరగా.. ఇప్పుడు వైసీపీకి కూడా ఈ ఛాలెంజ్లోకి దిగింది.. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. గంగాధర నెల్లూరు మండలంలోని నిర్మిస్తున్న సాఫ్ట్ వేర్ కంపనీ Smart DV కంపెనీ నిర్మాణం వద్ద సెల్ఫీ దిగిన ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి.. మరో రెండు నెలల్లో సీఎం వైఎస్ జగన్…
Kodali Nani Open Challenge: టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్ విసిరారు మాజీ మంత్రి కొడాలి నాని.. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు.. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు గుడివాడ కు ఏం చేశారు? అని నిలదీశారు.. గుడివాడలో పేదలకు ఇళ్ల కోసం ఒక్క ఎకరం భూమి చంద్రబాబు కొన్నారా? అని ప్రశ్నించారు.. చంద్రబాబు ఒక్క ఎకరం కొన్నా రాజకీయాలు వదిలేస్తాను అంటూ చాలెంజ్ చేశారు..…
JC Prabhakar Reddy Emotional: యువగళం పేరుతో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర 70 రోజులకు చేరుకున్న విషయం విదితమే.. అయితే, లోకేష్ పాదయాత్రపై భావోద్వేగానికి గురయ్యారు టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. మీడియాతో మాట్లాడుతూ ఆయన కంటతడి పెట్టుకున్నారు.. కార్యకర్తలు లేకపోతే నేను లేనన్న ఆయన. చంద్రబాబు చేసిన మంచి పనులతో ప్రజల మనిషి అయ్యారని పేర్కొన్నారు.. ఇక, లోకేష్ జనం కోసం పాదయాత్ర…