టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్ తీరుపై మంత్రి మేరుగ నాగార్జున తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు వీధి రౌడీలా ప్రవర్తించారు.టీడీపీ రధ చక్రాలు ఊడిపోయి జగన్ గ్రాఫ్ పెరుగుతూ ఉంటే బాబు కొడుకు రోడ్ పై పడ్డారు. మంత్రి ఆదిమూలపు సురేష్ పై బరి తెగించి దాడులు చేశారు. దళితుల్లో ఎవరైనా పుట్టాలి అనుకుంటారా అని అనలేదా చంద్రబాబు?దళితులకు మూలాలు లేవు అని బాబు చెప్తాడా అని మండిపడ్డారు.
దళితుల్ని భయపెడతావా చంద్రబాబు?రాజధానిలో దళితులు ఉంటే ఇబ్బంది అని చంద్రబాబు అన్నారు. ఇవాళ రూట్ లెవెల్ నుంచి పాలన జరుగుతోంది. రాష్ట్రంలో దళితులపై దాడి చేస్తే వదిలే ప్రసక్తి లేదు. ఆదిమూలపు సురేష్, విశ్వరూప్ అంటే తేలిగ్గా కనపడుతున్నారా చంద్రబాబు? లోకేష్ దళితులకు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని మంత్రి నాగార్జున డిమాండ్ చేశారు.
చంద్రబాబు చేసేవి చీప్ పాలిటిక్స్.. ఎమ్మెల్సీ అరుణ్ కుమార్
తాడేపల్లిలో ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడారు. దళిత జాతికి చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే చంద్రబాబు ఎక్కడికెళ్లినా నిరసనలు తప్పవు.చంద్రబాబు అన్ని డైవెర్షన్ పొలిటిక్స్ చేస్తాడు. చంద్రబాబు చేసే చీప్ పాలిటిక్స్ అందరికి తెలుసు అన్నారు అరుణ్ కుమార్. జగన్ కుటుంబ సభ్యుల పై పట్టాభి మాట్లాడితే నాలుక కోస్తాం. నోటికి ఏది వస్తే అది మాట్లాడ్డం మంచిది కాదు పట్టాభి. దళిత జాతికి చంద్రబాబు మోసం తెలిసి పోయింది అన్నారు.
Read Also:KOLORS Shocks: వెయిట్ లాస్ పేరుతో విద్యుత్ షాకులు.. నిర్లక్ష్యపు థెరపీతో ప్రాణాలకు ముప్పు