కనీసం 30-40 స్థానాలుంటేనే సీఎం అభ్యర్థిగా ఉంటామని అనగలం అన్నారు జనసేనాని.. మేం ఒక కులం కోసం పని చేసే పార్టీ కాదన్న ఆయన.. ముందస్తు ఎన్నికలు వస్తే జూన్ నుంచి క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేపడతామని ప్రకటించారు.. మా బలం మీదే ఆధారపడి సీట్ షేరింగ్ ఉంటుందని వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో మా బలం ఎక్కువ.. కొన్ని జిల్లాల్లో తక్కువ.. కానీ, జనసేనకు పట్టున్న ప్రాంతాల్లో కచ్చితంగా పోటీ చేస్తామని తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. నెల్లూరు జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తమ ఉనికిని కాపాడుకునేందుకు చంద్రబాబు. పవన్ కల్యాణ్‌ను రైతులపై ఎనలేని ప్రేమ చూపిస్తున్నట్లు నటిస్తున్నారని విమర్శించారు. అసలు పవన్ కు రాజకీయ అవగాహన లేదన్న ఆయన.. చంద్రబాబు హయాంలో రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు.. మరి అప్పుడు పవన్ ఎందుకు మాట్లాడ లేదు? అని ప్రశ్నించారు.. చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు ఏమి చేశారో…
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. పవన్ కల్యాణ్‌కు 10 పంటలు చూపిస్తే అందులో ఐదు పంటలను గుర్తించలేడని విమర్శించారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. పంటలు ఎలా పండిస్తారో కూడా పవన్‌కు తెలియదని ఆయన వ్యాఖ్యానించారు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పొలిటికల్ హైడ్రామాకు తెరలేచింది. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఇరగవరం నుంచి తణుకు వరకు రేపు చంద్రబాబు పాదయాత్ర చేపట్టనున్నారు.
Off The Record: ఉమ్మడి విశాఖజిల్లా తెలుగుదేశంపార్టీలో బండారు, చింతకాయల ఫ్యామిలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారసత్వ రాజకీయ పునాదులపై బలమైన నాయకులుగా ఎదిగారు మాజీ మంత్రులు సత్యనారాయణ మూర్తి, అయ్యన్నపాత్రుడు. ఉత్తరాంధ్రలో కీలకమైన వెలమ సామాజిక వర్గానికి ప్రతినిధులుగా ఆవిర్భావం నుంచి టీడీపీనే నమ్ముకున్న ఈ ఇద్దరు నేతలు సమాన గౌరవం ఆశిస్తుంటారు. అయ్యన్న పొలిట్ బ్యూరో సభ్యుడు కాగా… సత్యనారాయణ మూర్తికి కీలకమైన కాకినాడ, కోనసీమ జిల్లాల సమన్వయ బాధ్యతలు అప్పగించింది పార్టీ.…
RK Roja: ప్రతిపక్ష నాయకులు సెల్ఫీలతో డ్రామా చేస్తున్నారు.. వాళ్ళు చేసిన సెల్ఫీ డ్రామా ప్రతిపక్ష నేతలనే సెల్ఫ్ గోల్ లో పడేస్తుందని వ్యాఖ్యానించారు మంత్రి ఆర్కే రోజా.. విజయనగరంలో పర్యటించిన ఆమె.. పట్టణంలోని మహిళా పార్క్ ని ప్రారంభించారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. జగనన్న ప్రభుత్వం మహిళా పక్ష పాత ప్రభుత్వం అన్నారు.. మహిళలు పిల్లలతో పాటు కాలక్షేపం చేయడానికి మహిళా పార్క్ నిర్మించడం జరిగిందన్నారు.. ప్రతిపక్ష నాయకులు సెల్ఫీ లతో డ్రామా చేస్తున్నారు..…
Gudivada Amarnath: వారి బాధ చూస్తుంటే జాలి వేస్తోంది అంటూ తెలుగుదేశం పార్టీ నేతలపై సెటైర్లు వేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన… రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూడలేక టీడీపీ, వారి మీడియా విషం కక్కుతోందని మండిపడ్డారు.. వారి బాధ చూస్తుంటే జాలేస్తోందని ఎద్దేవా చేశారు.. ఇక, ఈ నెల 22న బందరు పోర్టుకు శంకుస్థాపన జరుగుతుందని ప్రకటించారు మంత్రి అమర్నాథ్.. రాష్ట్రంలో లక్షా 30 వేల మందికి సచివాలయాల్లో ఉద్యోగ అవకాశాలు…
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. టీడీపీ వల్ల దళారులు బాగుపడ్డారని.. వైసీపీ ప్రభుత్వం రైతుల అకౌంట్లో నేరుగా డబ్బులు జమ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
రాజధాని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్న టీడీపీ నేతలకు హైకోర్టు తీర్పు చెంప చెళ్లుమనిపించిందని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
Karumuri Nageswara Rao: అవినీతపరుడైన చంద్రబాబుని అరెస్ట్ చేస్తారు అంటూ సంచలన వ్యాఖ్యలుచేశారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మీడియాతో మాట్లాడిన ఆయన.. అమరావతి పేరుతో దోచుకున్నదంతా బయట పడుతుందనే భయంతోనే చంద్రబాబు జనంలో తిరుగుతున్నాడు అంటూ ఎద్దేవా చేశారు.. అకాల వర్షాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తూ.. రైతులతో మాట్లాడుతోన్న చంద్రబాబుపై మండిపడ్డ ఆయన.. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు చంద్రబాబు రైతుల విషయంలో మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు…