Off The Record: పోటాపోటీగా వైసీపీ, టీడీపీ సేవా కార్యక్రమాలు.. అన్నదానాల రచ్చ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఫ్యాక్షన్, రాజకీయ రగడతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే నియోజకవర్గం కడపు జిల్లా ప్రొద్దుటూరు. నిత్యం ఇక్కడ గొడవలు, రగడలే. ఇప్పుడు మరో వివాదంతో వైసీపీ, టీడీపీ నేతలు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు…రాయలసీమలో ముఖ్య వ్యాపార పట్టణమే కాదు.. రాజకీయాలకు కూడా ప్రధానమైన ప్రాంతమే.. రాయలసీమ స్థాయి రాజకీయాలు గతంలో ఇక్కడి నుంచే నడిచాయి. ఇక్కడి నేతల వ్యవహార శైలి, రాజకీయ ఎత్తుగడలు అన్నీ వెరైటీగా కనిపిస్తాయి. సేవ చేసినా.. రాజకీయాలు చేసినా, అది మంచైనా, చెడైనా ఇక్కడి ప్రతి పరిణామం రచ్చ కావాల్సిందే. దానిపై చర్చ జరగాల్సిందే. నాలుగేళ్లుగా ప్రొద్దుటూరు నియోజవకర్గంలో చోటు చేసుకున్న అనేక పరిణామాల్లో, అనేక అంశాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది.
తాజాగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మరో వారం పది రోజుల్లో రాజన్న భోజనం పేరుతో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడిదే ప్రొద్దుటూరు పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. రాజన్న భోజనం పేరుతో శాశ్వతంగా నిరుపేదల ఆకలి తీర్చేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు ఎమ్మెల్యే వివరించారు కూడా. ఇది ఎన్నికల స్టంట్ అనో… సేవ పేరుతో ఓటు బ్యాంకు కోసమో అనో ప్రతిపక్షాలు చేసే విమర్శలను పట్టించుకోనని, మంచి పని చేయాలని సంకల్పించి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి. బాల్యంలో అర్థాకలితో గడిపిన రోజులు, ఆనాడు పడ్డ కష్టాలే నేడు ఈ పనికి పూనుకునేలా చేశాయని చెప్పొకొచ్చారు. అవసరమైతే మొబైల్ క్యాంటిన్ ను నిరుపేదల ఆకలి తీర్చేందుకు ఏర్పాటు చేస్తానని వెల్లడించారు.
Also Read
- ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
ఇంత వరకు బాగానే ఉంది…ఎమ్మెల్యే రాచమల్లు తాము పెట్టాలనుకుంటున్న అన్నా క్యాంటిన్లకు పోటీగా రాజన్న భోజనం కార్యక్రామం పేరుతో పోటీ అన్నదానం చేస్తున్నారంటూ టిడిపి నేత రమేష్ నాయుడు ఆరోపించడంతో అన్నదాన కార్యక్రమం కాస్త పొలిటికల్ ఈవెంట్‌గా మారిపోయింది. లోకేష్ యువగళం జిల్లా పాదయాత్రలో భాగంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అన్నా క్యాంటిన్లను తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చి, నిరుపేదలకు ఉచితంగా అన్నదానం చేయాలని ముందే నిర్ణయించుకున్నామని, అయితే తమ ఉచిత అన్నదా కార్యక్రమం తెలుసుకుని….ఎమ్మెల్యే ఇప్పుడు ఇలా రాజన్న భోజనాన్ని ప్రకటించారన్న విమర్శలను ఎక్కుపెట్టారు.
ఇదే సందర్భంలో ఎమ్మెల్యేపై ఘాటైన విమర్శలే చేశారు టీడీపీ నేత. గతంలో అన్నా క్యాంటిన్లను మూసివేసి, ఇప్పుడు ఎన్నికల కోసం రాజన్న భోజనం పెడతానని ముందుకు రావడం ఏమిటని ప్రశ్నలు వర్షం కురిపించారు. శాశ్వతంగా అన్నదానం చేస్తానని ప్రకటించిన ఎమ్మెల్యే రాచమల్లు చెప్పిన మాటకు కట్టుబడతారా అని సూటిగా ప్రశ్నించారు. అన్నదాన కార్యక్రమ ప్రకటనలతో అధికార ప్రతి పక్ష పార్టీల మధ్య రాజకీయ వివాదం మొదలైంది. అయితే టిడిపి విమర్శలకు మళ్ళీ కౌంటరిచ్చారు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. టిడిపి నేత సీఎం సురేష్ నాయుడు రాజకీయ దురుద్దేశంతో అన్నా క్యాంటిన్లు పెట్టినా ప్రజలకు మేలు జరుగుతుందని కాబట్టి స్వాగతిస్తున్నానని, మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. నాలుగేళ్ల కిందట మూతపడిన అన్నా క్యాంటిన్లను ఇంతకాలం ఎందుకు నిర్వహించలేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. అన్నాక్యాంటిన్ల పేరుతో అవినీతి జరుగుతోందని…అందుకే వైసిపి అధికారంలోకి వచ్చాక వాటిని తీసివేసిందని ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు.
ఎమ్మెల్యే చెప్పినట్లుగా మరో వారం పది రోజుల్లో రాజన్న భోజనం…ఉచిత అన్నదాన కార్యక్రమం మొదలు కాబోతోంది. టిడిపి నేతలు కూడా ఈనెల 23న జిల్లాలోకి వస్తున్న లోకేష్ పాద యాత్రలో అన్నా క్యాంటిన్లను ప్రారభించాలని చూస్తున్నారు. దీంతో ప్రొద్దుటూరు అన్నదాన కార్యక్రమాలతో రాజకీయం వాడివేడిగా సాగనుంది. సేవా కార్యక్రమాల నిర్వహణలో రాజకీయాల కారణంగా వివాదం అవుతుందా.. లేక ఎవరి పని వారు చేసుకుపోతారా అన్నది చూడాలి.
తాజావార్తలు
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?