జనసేన టీడీపీకి బీ టీమ్ అనడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన నాయకులు, మహిళలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. వైసీపీ వాళ్లు జనసేనని బీ టీం అంటుంటే.. బయటి వాళ్లు అనడం వేరు .. మనవాళ్లు అనడం వేరు అంటూ జనసేన నాయకులకు ఆయన సూచించారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు ఫైరయ్యారు. పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలనేదే పవన్ తాపత్రయమని ఆయన వ్యాఖ్యానించారు.
పవన్ రూ. 300 కోట్ల ప్యాకేజ్ ఇస్తే.. జై చంద్రబాబు అంటాడు అంటూ సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి. దమ్ము, ధైర్యం ఉంటే సింగిల్గా పోటీ చేయి, ప్రజల తీర్పు చూద్దాం అంటూ సవాల్ చేశారు.