Ambati Rambabu: చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే.. అంబటి ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: చంద్రబాబు రోజూ గంట సేపు ఉపన్యాసం ఇవ్వాలని అనుకుంటున్నట్లు ఉన్నారని.. జగన్ రాయలసీమ ద్రోహి అని చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అధికారంలో నుంచి దింపకపోతే రాయలసీమను రత్నాల సీమగా మార్చేవాడట చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనంటూ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. వైసీపీపై బురద జల్లి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నాడని ఆయన విమర్శించారు. వ్యవసాయం, ఇరిగేషన్, రాయలసీమ గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు హయాంలో 300 కరువు మండలాలుగా ప్రకటించారన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క మండలాన్నీ కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదన్నారు. జగన్ పాదం ప్రభావం అలాంటిదన్నారు మంత్రి అంబటి రాంబాబు.
Also Read: Amit Shah: అమిత్ షా తెలంగాణ టూర్ మళ్లీ వాయిదా
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
చంద్రబాబు హైదరాబాద్‌లో ఓటుకు నోటు కేసులో దొరికిపోయాడని మంత్రి చెప్పారు. తనకు లాభం వచ్చిన ప్రాజెక్టులనే చంద్రబాబు తన హయాంలో కట్టారని, వీటిని తన దోపిడీ కోసం ఉపయోగించుకున్నారని మంత్రి ఆరోపించారు. ప్రాజెక్టులపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో రూ.27,394 కోట్లు ఖర్చు పెట్టినట్లు చెప్పారు. చంద్రబాబు మాత్రం తమ హయాంలో రూ.68,294 కోట్లు ప్రాజెక్టుల కోసం ఖర్చుపెట్టామని చెప్పడానికి బదులు మేం.. తిన్నాము అని అంటే బాగుండేదని విమర్శించారు. ఇక ఆయన పట్టిసీమ గురించి మాట్లాడుతుంటారని, అదొక ప్రాజెక్టా? అని ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టును ప్రారంభించి, రాయలసీమకు మేలు చేశామని చెబుతున్నాడని ధ్వజమెత్తారు. ఈ ప్రాజెక్టు పేరుతో రూ.257 కోట్లు కొట్టేశాడన్నారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలు, అవాస్తవాలే అన్నారు.
Also Read: Minister RK Roja: జగన్ దానకర్ణుడు, చంద్రబాబు కుంభకర్ణుడు.. మంత్రి రోజా కామెంట్స్
చంద్రబాబు పోలవరానికి చేసిన 10,540 కోట్లు ఖర్చును మొత్తం వ్యయంలో కలిపారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నీరు- చెట్టుకు 13వేల కోట్ల రూపాయలను ఖర్చు పేరుతో దోచుకున్నారని ఆయన మండిపడ్డారు. రైతుల గురించి, వ్యవసాయం గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని మంత్రి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. తన ప్రయోజనాల కోసం నిధులను దుర్వినియోగం చేసిన వ్యక్తి ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడినా ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. వ్యవసాయం గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో కరవు మండలాలు ప్రకటించే అవసరం లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయన్నారు. ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయన్నారు. ఈ అయిదేళ్లు వర్షాలు బాగా కురిశాయని, దీంతో పట్టిసీమ ప్రాజెక్టును ఉపయోగించే అవసరం లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నారని, కానీ చేసిందేమీ లేదన్నారు.
Also Read: AP High Court: బిగ్‌బాస్ షోను సెన్సార్ చేయకపోతే ఎలా?.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
ముఖ్యమంత్రిగా ఉన్న 14 ఏళ్ళ కాలంలో చంద్రబాబు ఒక్క ప్రాజెక్టును అయినా డిజైన్ చేశాడా మంత్రి ప్రశ్నించారు. వైఎస్సార్ అన్ని ప్రాజెక్టులను ఫ్రెష్‌గా జీవోలు ఇచ్చి ప్రారంభించారన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్సార్ రాయలసీమ కరువు బండ పేరుతో యాత్ర ప్రారంభించారని.. పోతిరెడ్డిపాడు వరకు పాదయాత్ర చేశారన్నారు. డిశ్చార్జ్ కెపాసిటీని పెంచితే కానీ సీమకు నీళ్ళు రావని పోరాటం చేసిన యోధుడు రాజశేఖరరెడ్డి అని మంత్రి పేర్కొన్నారు. రాజశేఖరరెడ్డి శంఖుస్థాపన చేసిన నెల్లూరు ప్రాజెక్టులను జగన్ ప్రారంభించటం చరిత్ర అంటూ మంత్రి తెలిపారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఏమీ చేయని చంద్రబాబు ఇప్పుడు రత్నాల సీమ చేస్తానంటే ప్రజలు నమ్మాలా అంటూ అంబటి రాంబాబు ప్రశ్నల వర్షం కురిపించారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?