Minister Ambati Rambabu: జగన్ గర్జిస్తే లోకేష్ లాగులో పోసుకోవాల్సిందే..! టీడీపీ గంగలో కలిసిపోతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Ambati Rambabu: సీఎం వైఎస్ జగన్‌కు నారా లోకేష్ భయం పరిచయం చేస్తాడా..? అసలు జగన్ గర్జిస్తే లోకేష్ లాగులో పోసుకోవాలి అంటూ వార్నింగ్ ఇచ్చారు మంత్రి అంబటి రాంబాబు.. విజయవాడలో జరిగిన తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి రచించిన ‘అల్లుడు సుద్దులు’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీకి పట్టిన శని లోకేష్.. ఆ లోకేష్ పేరు మీద టీడీపీ గంగలో కలిసిపోతుందని వ్యాఖ్యానించారు.. ఇక, చంద్రబాబు తోడల్లుడు వెంకటేశ్వరరావు కూడా ఒక పుస్తకం రాశారు.. చంద్రబాబు అధికార దాహంతో ఆతృతపడుతున్నారు.. లక్ష్మీపార్వతి భుజం మీద నుంచి తుపాకీ పెట్టి ఎన్టీఆర్ ను కాల్చేశారని ఆరోపించారు. చంద్రబాబు పూర్తి నిజస్వరూపం లక్ష్మీపార్వతికి ఇంకా తెలియదేమో అనుకుంటా.. కానీ, చంద్రబాబు బావమరిదికి తెలుసు అతని నిజ స్వరూపం అన్నారు. బంధుత్వాలను, డబ్బును వాడుకుని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు.
మరోవైపు, చంద్రబాబు సీఎం అయ్యాక ఎన్నికల ఖర్చులు పెరిగాయని విమర్శించారు మంత్రి అంబటి రాంబాబు.. ఎన్టీఆర్ ఒక భోళాశంకరుడు.. ఎవరినైనా నిలబెట్టి గెలిపించగలను అన్న విశ్వాసం పొందగలిగిన వ్యక్తి ఎన్టీఆర్.. అలాంటి లక్షణం వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి వచ్చింది.. ఆ తర్వాత వైఎస్ జగన్‌కి వచ్చిందని తెలిపారు.. చంద్రబాబు అధికారం కోసం ఎవరితో అయినా కలుస్తాడు.. చంద్రబాబు దత్తపుత్రుడు కూడా అందరితో కలిశాడు అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు సీఎం అవ్వాలని పవన్ నానా గడ్డి కరుస్తున్నాడని మండిపడ్డారు. సీఎం జగన్ వి సాంప్రదాయేతర రాజకీయాలన్న ఆయన.. కానీ, ఎవరి భుజాల మీదైనా ఎక్కేందుకు చంద్రబాబు చూస్తున్నాడని సెటైర్లు వేశారు.
Also Read
- T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
- Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
- Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
ఎమ్మెల్యేలు, మంత్రుల కొడుకులు రాజకీయ నాయకులుగా పరిణతి చెందుతున్నారు. కానీ, ఏ సీఎం కొడుకు అయినా ముఖ్యమంత్రి అయ్యాడా అంటే వైఎస్ జగన్ మాత్రమే అయ్యాడని తెలిపారు మంత్రి రాంబాబు.. సరుకుంటే రాజకీయ పరిణతి చెందుతారన్న ఆయన.. నారా లోకేష్.. సీఎం జగన్ కు భయం పరిచయం చేస్తాడా..? జగన్ గర్జిస్తే లోకేష్ లాగులో పోసుకోవాలి..! అంటూ కామెంట్ చేశారు.. ఇక, టీడీపీకి పట్టిన శని లోకేష్.. లోకేష్ పేరు మీద టీడీపీ గంగలో కలిసిపోతుందన్న ఆయన.. ఏదోలా ప్యాంటు షర్డు వేసి లోకేష్ ని సీటులో కుర్చోపెట్టాలని చంద్రబాబు చూస్తున్నాడంటూ సెటైర్లు వేశారు. మరోవైపు.. లోకేష్ తో చేరి దత్తపుత్రుడు (పవన్ కల్యాణ్) పాడైపోతున్నాడు. రోజుకు రెండు కోట్లు సంపాదించే పవన్.. ట్యాక్స్ కడుతున్నాడో లేదో? అనే అనుమానాలు వ్యక్తం చేశారు. మా కులం వాళ్లు మావాడు సీఎం అవుతాడనుకుంటున్నారు.. పవన్ నాశనం అవ్వడమే కాకుండా సినిమా పిచ్చితో ఉన్న యువకులు పాడైపోతున్నారని పేర్కొన్నారు. త్వరలో పవన్ పై కూడా పుస్తకం రాయాల్సి వస్తుందేమోనన్నారు.. పవన్ కి కూడా ఒక పుస్తకం పంపించాలని లక్ష్మీపార్వతిని కోరారు. ఈ పుస్తకం చదివి పవన్ కల్యాణ్ జ్ఞానోదయం పొందాలి అంటూ వ్యాఖ్యానించారు మంత్రి అంబటి రాంబాబు.
తాజావార్తలు
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
ట్రెండింగ్
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..